మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేశాడు.. రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారా?

మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేయడమేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయినటువంటి అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మ‌ధ్య‌ వున్న స్నేహం గురించి వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వార‌సుడు నాగ చైతన్య నటించిన సంగతి విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది.

ఈ సినిమానే అక్కడ వేసింది?

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని భారీ అంచనాలను పెంచేసింది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ ముమ్మురం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో తాజాగా తన మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి కోసం లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ నిర్వహించారు అమీర్ ఖాన్. అంతేకాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అతిథుల కోసం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన లాల్ సింగ్ చద్దా ప్రత్యేక ప్రివ్యూను హైదారాబాద్ లో ఇటీవల నిర్వహించారు. దాంతోపాటు ఈ వారం మొద‌ట్లో హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది.

హాజరైన అతిధులు వీరే:

ఇక ఈ ప్రివ్యూకి ప్రత్యేక అతిధులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్ డైరెక్టర్లు SS. రాజమౌళి, సుకుమార్ గార్లు పాల్గొన్నారు. లాల్ సింగ్ చద్దా ప్రత్యేక ప్రివ్యూకి మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులంతా ఈ సినిమా ప‌ట్ల ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ ప్రివ్యూకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. హాలీవుడ్ లో విజయవంతమైన ‘ఫారెస్ట్ గంప్’కు ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసినదే కదా. ఇక ఈ సినిమాను ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.