తమ్ముళ్ళ కుమ్ములాట..కంచుకోటలో కష్టాలు!

కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…గత రెండు ఎన్నికల్లో కర్నూలులో వైసీపీ హవా నడిచింది…అయితే ఇలా వైసీపీ హవా ఉన్న కర్నూలు జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి…వైసీపీ రాకముందు.. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ సత్తా చాటింది. వైసీపీ ఎంటర్ అయ్యాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో కంచుకోటల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఇక ఇప్పటికీ ఆ కోటల్లో టీడీపీ పికప్ అవ్వడం లేదు…పైగా అంతర్గత కుమ్ములాటలు టీడీపీకి కొత్త కష్టాలు తీసుకొస్తున్నాయి.

అలా టీడీపీ కష్టాల్లో ఉన్న కంచుకోట వచ్చి ఎమ్మిగనూరు…ఈ నియోజకవర్గంలో మొదట నుంచి టీడీపీ హవా నడుస్తోంది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచింది…అలాగే 2014లో కూడా విజయం సాధించింది. కర్నూలు జిల్లాలో ఇలా టీడీపీ ఎక్కువసార్లు గెలిచిన నియోజకవర్గం ఇదే. అలాంటి నియోజకవర్గంలో 2019 నుంచి టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఎలాగో జగన్ వేవ్ లో ఎమ్మిగనూరులో కూడా టీడీపీ ఓడిపోయింది.

Kotla Jaya Surya Prakash Reddy lambasts government for foisting false cases  on TDP leaders

ఆ తర్వాత నుంచి అక్కడ పికప్ అవ్వలేకపోతుంది. పైగా టీడీపీలో వర్గ పోరు పెరిగింది. ఇక్కడ ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ఉన్నారు..ఆయనే అప్పుడప్పుడు నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సెపరేట్ గా టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేశారో…అప్పటినుంచి ఎమ్మిగనూరు టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది.

కొందరు ఏమో జయనాగేశ్వర్ రెడ్డి గ్రూపులో ఉండగా, మరికొందరు కోట్ల గ్రూపులో ఉన్నారు…ఇలా టీడీపీలో రెండు గ్రూపులు వచ్చాయి. పైగా ఇక్కడ కోట్ల పోటీ చేయాలని చూస్తున్నారట..అధిష్టానం ఆదిశిస్తే ఎవరైనా పోటీ చేయొచ్చని ఆ మధ్య ప్రకటన చేశారు. దీంతో జయనాగేశ్వర్ వర్గంలో అసంతృప్తి పెరిగింది..ఇక జయనాగేశ్వర్ కూడా నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో కూడా ఉండటం లేదని తెలిసింది. ఇలా ఎమ్మిగనూరు టీడీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది…ఈ పోరు వల్ల మళ్ళీ కంచుకోట టీడీపీ చేజారిన ఆశ్చర్యపోనవసరం లేదు.

Share post:

Latest