మ‌హామ‌హుల‌కే టికెట్లు లేవా… టీడీపీలో కీల‌క నేత‌ల‌కు బిగ్ షాక్‌లు…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు..ఆ దిశ‌గా వేస్తున్న అడుగులు అంద‌రికీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. టీడీపీఅంటే… సీనియ‌ర్ల‌కు ఆల‌వాలం. తా ము అడిగినా.. అడ‌గ‌క పోయినా.. టికెట్లు కేటాయించేస్తార‌నే వాద‌న వారిలో ఉంది. దీంతో పార్టీలో యాక్టివ్ గా ఉన్నా.. లేకున్నా.. ఎన్నిక‌ల స‌మాయానికి వాలిపోతే..టికెట్ చేతిలో పెట్టేస్తార‌ని.. నాయ‌కులు ద్రుఢం గా నిర్ణ‌యించుకున్నారు. అయితే. ఇప్పుడు ప‌రిస్థితి మారింది.

క‌ష్ట‌ప‌డే వారికే టికెట్ అనే మాట‌వినిపిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 శాతం టికెట్లు యువ‌త‌కే ఇస్తాన‌ని..చంద్ర‌బాబు చెప్పారు. అంటే.. ఆమేర‌కు సీనియ‌ర్ల‌కు కోత ప‌డుతుంద‌నేది వేరేగా ఆయ‌న చెప్పా ల్సిన ప‌నిలేదు. అయితే. ఎవ‌రికి టికెట్లు ఇస్తారు? ఎవ‌రికి ఇవ్వ‌రు? అనేది ప‌రిశీలిస్తే.. పార్టీలో సీనియ‌ర్లు గా ఉండి.. గ‌తంలో ప‌ద‌వులు అనుభ‌వించి.. రూపాయి పోగేసుకుని..ఇప్పుడు పార్టీకి మొహం కూడా చూపిం చ‌కుండా.. పార్టీ కేడ‌ర్‌ను ఆదుకోకుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్న‌వారికి చంద్ర‌బాబు మొండి చేయి చూప‌నున్నా రు.

అంతేకాదు.. పార్టీలో ఉంటూనే.. పొరుగు పార్టీ నేత‌ల‌కు ట‌చ్‌లో ఉంటూ.. ప్ర‌త్యేకంగా వారితో సంబంధాలు పెట్టుకున్న‌వారికి కూడా టికెట్ ద‌క్క‌ద‌నే సంకేతాలు పంపేశారు. తాజాగా క‌ర్నూలు జిల్లాలో సీనియ‌ర్ మోస్ట్ కుటుంబం.. కేఈ కృష్ణ‌మూర్తి ఫ్యామిలీకే అనుకున్న డోన్ టికెట్‌ను వీరికి ఇవ్వ‌కుండా.. ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డి అనే నేత‌కు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇది ఒక‌ర‌కంగా.. సంచ‌ల‌నం సృష్టించింది. నిజానికి కేఈ కుటుం బం ఇక్క‌డ టీడీపీలో చ‌క్రం తిప్పుతుండ‌గా.. ఆ కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టేశారు.

నిజానికి ఈ కుటుంబం పార్టీలో సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ.. కొన్నాళ్లుగా యాక్టివ్గా లేదు. క‌నీసం.. గ‌త ఎన్నిక ల్లో ఓడిపోయిన‌.. కేఈ శ్యాంబాబు కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు త‌ను అనుకున్న విధంగా.. చేసి.. నేత‌ల‌కు గ‌ట్టి సంకేతాలు పంపించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలానే ఉన్న నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

క‌నీసం.. బ‌య‌ట‌కు కూడా రాక‌పోవ‌డం.. త‌నే స్వ‌యంగా రోడ్డెక్కినా.. నాయ‌కులు ఇల్లు దాటక పోవ‌డం.. రూపాయి ఖ‌ర్చు పెట్టి.. పార్టీ ని డెవ‌ల‌ప్ చేయ‌డం అనేవిష‌యాన్ని ప‌క్క‌న పెట్టిన వారికి చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా ప‌క్క‌న పెట్ట‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share post:

Popular