ట్రైలర్ టాక్: ‘హీరో’ ఇంట్రొడక్షన్ అదిరింది!

టాలీవుడ్‌లో వారసత్వ హీరోలకు కొదువే లేదు. చైల్డ్ ఆర్టిస్టుల నుండి స్టార్ హీరోలుగా మారిన వారు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. అయితే కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుండటంతో కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా మరో సినీ అండ్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వారసుడు టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రముఖ టీడీపీ నేత గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. గల్లా జయదేవ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి బావ అవుతుండటంతో తన మేనల్లుడి ఎంట్రీ కోసం మహేష్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడు.

- Advertisement -

ఇక అశోక్ గల్లా నటిస్తున్న చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ చూస్తే.. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘హీరో’ తెరకెక్కిందని తెలుస్తోంది. సినిమాలో హీరో అవ్వాలనే కసితో ఓ కుర్రాడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇక ఈ సినిమాలో పలువురు సీనియర్ ఆర్టిస్టులు కనిపించగా, హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఓ రేంజ్‌లో అందాల ఆరబోత చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నాడు. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే కథనంతో ఈ సినిమా వస్తుందని, ఈ సినిమాతో అశోక్ గల్లా ఖచ్చితంగా హిట్ అందుకుంటాడని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. మరి ఈ సినిమాతో మరో సినీ వారసుడు నిజంగానే ‘హీరో’గా నిలదొక్కుకుంటాడా లేడా అనేది చూడాలి.

Share post:

Popular