ఆహాలో అల‌రించ‌బోతున్న‌ `రొమాంటిక్`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!

డాషింగ్ & డేరింగ్‌ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనీల్ పాదూరిని దర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌థ అందించిన పూరి జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా నిర్మించారు కూడా.

Akash Puri - Romantic : ఆకాష్ పూరీ 'రొమాంటిక్' మూవీ విడుదల తేది ఖరారు.. అఫీషియల్ ప్రకటన..

భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో అల‌రించేందుకు సిద్ధం అవుతోంది. అవును, ఈ చిత్రం న‌వంబ‌ర్‌ 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని ఆహా టీమ్ అధికారికంగా తెలియ‌జేసింది.

Image

కాగా. గోవా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ప్రేమలో ఉన్నా.. అది మోహమే అనుకున్న ప్రేమ జంట మ్యాడ్లీ లవ్ స్టోరీని ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు. ఈ సినిమాతో ఆకాష్ న‌ట‌న ప‌రంగా మ‌రో మెట్టు ఎక్క‌గా.. కేతిక త‌న‌ పాత్ర‌కు న్యాయం చేసింది. మ‌రియు ఏసీపీ రమ్య గోవరికర్ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఏదేమైనా యూత్‌కి ఫుల్ కిక్కిచ్చే ఈ మూవీ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.