కొర‌టాల కీల‌క నిర్ణ‌యం..ఎన్టీఆర్ లేకుండానే కానిచ్చేస్తార‌ట‌?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

NTR30: When will it officially begin!

అయితే ఈ సినిమాను చాలా నెల‌ల క్రిత‌మే అనౌన్స్ చేశారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఏదో ఒక కార‌ణం చేత‌ ఈ మూవీ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో ఆయ‌న డిసెంబ‌ర్ వ‌ర‌కు షూటింగ్‌లో పాల్గొనే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలోనే కొర‌టాల కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

Jr NTR on Koratala Siva, Prashanth Neel's movies - English

ఎన్టీఆర్‌ను ప‌క్క‌న పెట్టేసి షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ఆయ‌న ఫిక్స్ అయ్యార‌ట‌. ఈ నెలాఖరున ఎన్టీఆర్ లేకుండా ఇతర తారాగణంతో రెగ్యుల‌ర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా ఆలియా భ‌ట్‌ను ఖ‌రారు చేశార‌ని టాక్‌.