మహాత్మా గాంధీ గొప్పతనం తెలిపే అద్భుత సినిమాలు ఇవే!

మహాత్మా గాంధీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులలో మహాత్మాగాంధీ కూడా ఒకరు. ఆయన ఎంచుకున్న శాంతి, అహింసా మార్గం కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది.నేడు మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా జాతిపితను మరోసారి స్మరించుకుంటూ.. గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా, తెరకేక్కిన సినిమాల గురించి తెలుసుకుందాం..

 

బ్రిటీష్ ఫిలిం మేకర్ రిచర్డ్ అటెన్ బర్గ్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ’. 1982 లో విడుదలైన ఈ సినిమాలో బ్రిటీష్ యాక్టర్ బెన్ కింగ్‌స్లే మహాత్మా గాంధీ పాత్రలో నటించాడు. సినిమా తెరకెక్కించిన తీరు ఆస్కార్ అవార్డు దక్కింది.ఇలా మొత్తం ఈ సినిమాకి 8 ఆస్కార్ అవార్డులు వరించడం విశేషం.

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే సాధారణ వ్యక్తి దేశం గర్వించేలా మహాత్మా గాంధీ ఎలా అయ్యారు అనే అంశంతో ది మేకింగ్ ఆఫ్ మహా​త్మ సినిమా తెరకెక్కింది. ఇందులో బ్రిటిషర్లను దేశం నుంచి ఎలా తరిమి కొట్టారనే అంశాలను చూపించారు.

కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హే రామ్’. మహాత్మ గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ మై ఫాదర్’. ఈ మూవీ గాంధీలోని మరో కోణాన్ని చూపించింది. యావత్ జాతికి జాతి పితగా నిలిచిన గాంధీ తన సొంత కుమారుడి చేత ఒక మంచి తండ్రి అనిపించుకోలేకపోయారు అనే అంశం తో ఈ సినిమాను తెరకెక్కించారు.

శ్రీకాంత్‌, భావన కలిసి నటించిన చిత్రం ‘మహాత్మా’. ఈ మూవీలో రౌడీగా ఉన్న కథనాయకుడు గాంధీజీ ప్రేరణతో ఎలా మారాడు అనేది ఈ సినిమా వృత్తాంతం.

లగేరహో మున్నాభాయ్ ఈ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏ సినిమా తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్ తో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు.

కేవలం ఇవి మాత్రమే కాకుండా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఇంకా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.

Share post:

Popular