బాబు-పవన్ కాంబినేషన్..గోదావరి జిల్లాల్లో వన్‌సైడ్.!

మరి అనుకుని వెళ్లారో..లేక యాదృచ్చికంగా  జరిగిందో తెలియదు గాని..ఇటు టి‌డి‌పి అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్..గోదావరి జిల్లాలోనే పర్యటించి..అకాల వర్షాలకు నష్టపోయిన రైతులని పరామర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన గోదావరి రైతులని మొదట బాబు పరామర్శించారు..తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతులకు అండగా నిలిచారు. ఇక బాబు ఇలా రైతులని పరామర్శించిన వెంటనే..సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్..రైతులని పరామర్శించేందుకు గోదావరి జిల్లాలకు […]

నాగబాబుతో రాజుగారికి లైన్ క్లియర్..జనసేన నుంచే.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలని నాదెండ్ల మనోహర్ తో పాటు, నాగబాబు తీసుకున్నారు. వీరే రాష్ట్రమంతా పర్యటిస్తూ జనసేన కార్యకర్తలని యాక్టివ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. ఇక పొత్తులపై ఎవరు మాట్లాడవద్దని, అవన్నీ పవన్ చూసుకుంటారని, పవన్ ఏ నిర్ణయం తీసుకున్న గౌరవిద్దామని చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని నాగబాబు ప్రకటించారు. గత […]

సైడ్ అయిన నాగబాబు..జనసేనలో ట్విస్ట్..రాజుగారికి ఛాన్స్.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..అనుకున్న విధంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టని విషయం తెలిసిందే. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఏదో అప్పుడప్పుడు మాత్రమే వచ్చి..రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశంపై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన కోసం అటు నాదెండ్ల మనోహర్, ఇటు నాగబాబు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే […]

బీజేపీకి టీడీపీ దూరమే..గట్టిగానే టార్గెట్ చేశారు.!

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య ఉంటుందంటే..ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. కాకపోతే బి‌జే‌పితో పొత్తు విషయంలో మాత్రం క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. జనసేన-బి‌జే‌పి కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. కానీ టి‌డి‌పితో కలవడానికి జనసేన రెడీ అవుతుంది. ఇలాంటి సమయంలో బి‌జే‌పిని కూడా కలుపుకుని టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాలని జనసేన చూస్తుంది. కానీ బి‌జే‌పి మాత్రం టి‌డి‌పితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. టి‌డి‌పి వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నామని బి‌జే‌పి నేతలు అంటున్నారు. దీంతో బి‌జే‌పి […]

జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ స్టిక్క‌ర్ల వార్‌…!

`మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం వినూన్న కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. మ‌రోసారి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇంచార్జులు, గృహ‌సార‌థుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపిస్తోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రిస్తోంది. అదేస‌మ‌యంలో గ‌త చంద్ర బాబు ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన కార్య‌క్ర‌మాలు.. వాటిని తాము ఎలా కొన‌సా గించామో.. కూడా.. వైసీపీ స‌ర్కారు వివ‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే `మాన‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో జ‌గ‌న్ […]

టీడీపీ-జనసేనతో కమ్యూనిస్టులా? కమలమా?

ఏపీలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది..వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పనిచేయనున్నారు? అంటే ఇప్పుడే ఆ అంశం క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. టీడీపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉంది. కానీ జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలవడానికి సిద్ధంగా లేదు. ఇటు టి‌డి‌పి సైతం జనసేనతో ఓకే గాని..బి‌జే‌పితో పొత్తు అంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పిపై నెగిటివ్ ఉంది. కాకపోతే […]

 టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ మైండ్‌గేమ్!

టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ ముమ్మాటికి నష్టమే..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రెండు పార్టీలు కలిస్తే ఓట్లు చీలిక ఉండదు..అదే కలిసి లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలో పొత్తుని చెడగొట్టేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇప్పటికే దమ్ముంటే 175 స్థానాల్లో […]

తూర్పులో వైసీపీకి పొత్తు దెబ్బ..టీడీపీ-జనసేన ఆధిక్యం!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఉన్న జిల్లా. ఈ జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఆధిక్యం సాధించిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అదే జరిగింది. జిల్లాలో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు సాధించింది. అయితే ఈ సారి పరిస్తితి హోరాహోరీగా ఉంది. మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. […]

బీజేపీలో పవన్ కల్లోలం..పొత్తుపై రచ్చ!

ఏపీ బీజేపీలో పొత్తు అంశంపై రచ్చ నడుస్తోంది..జనసేనతో పొత్తుకు కాలం చెల్లినట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల తర్వాత బి‌జే‌పి-జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు పెట్టుకున్నాయి గాని ఏనాడూ కూడా వారు కలిసి పనిచేయలేదు. పదే పదే కలిసి పనిచేద్దామని పవన్ పిలుపునిచ్చిన ఏపీ బి‌జే‌పి నేతలు ముందుకు రాలేదు. ఆ విషయాన్ని పవన్ పలుమార్లు చెప్పారు. కేంద్రంలో ఉన్న నాయకులు సహకరిస్తున్నారు గాని..రాష్ట్రంలో ఉన్న నాయకులు సహకరించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం […]