నాగబాబుతో రాజుగారికి లైన్ క్లియర్..జనసేన నుంచే.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలని నాదెండ్ల మనోహర్ తో పాటు, నాగబాబు తీసుకున్నారు. వీరే రాష్ట్రమంతా పర్యటిస్తూ జనసేన కార్యకర్తలని యాక్టివ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. ఇక పొత్తులపై ఎవరు మాట్లాడవద్దని, అవన్నీ పవన్ చూసుకుంటారని, పవన్ ఏ నిర్ణయం తీసుకున్న గౌరవిద్దామని చెబుతూ వస్తున్నారు.

ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని నాగబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఈయన నరసాపురం ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్లు వరకు పడ్డాయి. ఇక ఇలా జనసేన ఓట్లు చీల్చడం వల్ల నరసాపురం లో  టి‌డి‌పి ఓడిపోయింది..అలాగే వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు గెలిచారు. ఇక రఘురామ తర్వాత వైసీపీ రెబల్ ఎంపీగా మారిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో రఘురామ మళ్ళీ నరసాపురం నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. ఎలాగో వైసీపీ నుంచి పోటీ చేయరు. కాబట్టి ఆయన టి‌డి‌పి లేదా జనసేన నుంచి పోటీ చేయాలి.

అయితే దాదాపు టి‌డి‌పి-జనసేన పొత్తు ఫిక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ సీటు ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ నుంచి రఘురామ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈ సీటు జనసేనకే దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి..ఏలూరు, నరసాపురం..పొత్తులో భాగమ ఏలూరు టి‌డి‌పికి, నరసాపురం జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. దీంతో జనసేన నుంచే రఘురామ నరసాపురం బరిలో దిగవచ్చని తెలుస్తోంది.చూడాలి మరి ఏం జరుగుతుందో.