టాలీవుడ్‌పై హీరోయిన్ సెటైర్లు… ఆమె ప్రశ్నకు షాక్‌ అయిన జర్నలిస్టులు!

తెలుగు బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ తెలుగులో కాకుండా తమిళ తెరపైన ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగులో ఆమె నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఇక్కడ ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. నటిగా ఆమె ఆకట్టుకున్నప్పటికీ ఒక్క హిట్‌ కూడా పడకపోవడంతో తమిళంకే పరిమితమైంది. ఆమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే. దీంతో కోలీవుడ్‌తోనే ఆమెకి ఎక్కువగా అనుబంధం ఉంది. దాంతో అక్కడే తాను హీరోయిన్‌గా, నటిగా రాణించాను అని చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా ఆమెని ఓ మీడియా వేదికలో తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు అనే ప్రశ్న వేయగా… పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సరైన ఆఫర్లు రావడం లేదని, వచ్చినా నచ్చడం లేదని చెప్పింది. కాగా తాను నటించిన `ఫర్హానా` చిత్రం తమిళంతోపాటు హిందీ, తెలుగులో కూడా ఈ నెల 12న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సోమవారం హైదరాబాద్‌కి వచ్చిన ఐశ్వర్య రాజేష్‌ మీడియాతో ముచ్చటించగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తెలుగు సినిమాలలో ఆమెకి వచ్చే పాత్రలు చాలా రెగ్యూలర్‌ గా ఉంటున్నాయని, పాత్రకి ప్రయారిటీ లేకపోతే తాను నటించలేనని వెల్లడించింది. ఈ కారణంగానే తెలుగులో ఆమె సినిమాలు చేయలేకపోతున్నానని తెలిపింది. కాగా ఈ విషయం మీడియా సర్కిల్ లో వైరల్ కావడంతో పరోక్షంగా ఆమె టాలీవుడ్‌పై సెటైర్లు వేసినట్టు కొంతమంది చర్చించుకుంటున్నారు. మరోవైపు వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేయడంపై అడిగిన ప్రశ్నకి కాస్త వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యింది. ఇదే ప్రశ్న మీరు హీరోలని అడగగలరా? ఎందుకు సర్‌ మీరు కంటిన్యూగా హీరోగానే చేస్తున్నారని? అంటూ అదిరిపోయే సెటైర్లు వేసింది ఐశ్వర్య రాజేష్‌.

Share post:

Latest