అతి త్వరలో పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారమ్. జనసేన పార్టీని 2014 లోనే పవన్‌కళ్యాణ్ స్థాపించినప్పటికీ అది రాజకీయ పార్టీగా అవతరించడానికి, విస్తరించడానికి ఇంకా సరైన ముహూర్తం దొరికినట్లుగా లేదు. అందుకే పవన్‌కళ్యాణ్ కూడా పలు సాకులు చెబుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. పార్టీని నడపడానికి తగినంత ఆర్థిక వనరులు లేవని పవన్‌కళ్యాణ్ చెప్పడం అభిమానుల్ని బాగా హర్ట్ చేసింది గతంలో. అదలా ఉంచితే సినిమాల్లో బిజీ అయిన పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ […]
