బాబు-పవన్ కాంబినేషన్..గోదావరి జిల్లాల్లో వన్‌సైడ్.!

మరి అనుకుని వెళ్లారో..లేక యాదృచ్చికంగా  జరిగిందో తెలియదు గాని..ఇటు టి‌డి‌పి అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్..గోదావరి జిల్లాలోనే పర్యటించి..అకాల వర్షాలకు నష్టపోయిన రైతులని పరామర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన గోదావరి రైతులని మొదట బాబు పరామర్శించారు..తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతులకు అండగా నిలిచారు.

ఇక బాబు ఇలా రైతులని పరామర్శించిన వెంటనే..సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్..రైతులని పరామర్శించేందుకు గోదావరి జిల్లాలకు వచ్చారు. ఇలా ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు గోదావరి జిల్లాల్లో పర్యటించారు. అయితే అటు టి‌డి‌పికి గాని, ఇటు జనసేనకు బాగా పట్టునది గోదావరి జిల్లాలపైనే. కాకపోతే గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీ గెలిచింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లు వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది.

అయితే ఈ రెండు జిల్లాల్లో టి‌డి‌పిపై వ్యతిరేకతతో వైసీపీ గెలవలేదు..కేవలం జనసేన భారీగా ఓట్లు చీల్చడం వల్ల గెలిచింది. ఒకవేళ అప్పుడే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే..ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి ఆధిక్యం వచ్చేది కాదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగో టి‌డి‌పి-జనసేన పొత్తులో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయి.

పొత్తు ఉంటే ఏ మాత్రం డౌట్ లేకుండా గోదావరి జిల్లాల్లో టి‌డి‌పి-జనసేన వన్ సైడ్ గా గెలిచేస్తాయి. రెండు జిల్లాల్లో కలిపి 34 సీట్లు ఉన్నాయి..అందులో కనీసం 25 సీట్లు పైనే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Share post:

Latest