చీర కట్టులో మరోసారి గిలిగింతలు పెడుతున్న కృతి శెట్టి..!

కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే యువత హృదయాలను తన వశం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనిపిస్తూ తన అందంతో కుర్రకాను కట్టిపడేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కస్టడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 12వ తేదీన చాలా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. కృతి శెట్టి కూడా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ అందరిని అలరిస్తోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే ఔట్ఫిట్ లతో ఫోటోషూట్లు చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే చీరకట్టులో మెరిసి మరొకసారి హొయలు పోతూ యువత పల్స్ తో ఆడుకుంటుంది. బేబమ్మ చీరకట్టు అందాలకు అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. శారీలో బ్యూటిఫుల్ లుక్ ను సొంతం చేసుకోవడంతో చూపు తిప్పుకోలేకపోతున్నారు.

మరొకవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి కృతి శెట్టి గ్లామర్ మెరుపులు మెరిపించడంతో ఈమె అందాలకు ఫిదా అవుతున్నారని చెప్పాలి. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ కృతి శెట్టికి మరింత అందాన్ని తీసుకొచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. ఇది చూసిన చాలా మంది ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏది ఏమైనా కృతి శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.