హీరోతో ఎఫైర్.. రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయిన ఝాన్సీ.. అస‌లేం జ‌రిగిందంటే?

స్టార్ యాంక‌ర్ మ‌రియు ప్ర‌ముఖ న‌టి ఝాన్సీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే జోగి నాయుడుతో ఈమె ఏడ‌డుగులు వేసింది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. చిన్న వ‌య‌సులోనే విడాకులు అయినా.. ఝాన్సీ రెండో పెళ్లి చేసుకోలేదు.

ఒంట‌రిగానే ఉంటూ యాంక‌ర్‌, న‌టిగా స‌త్తా చాటుతోంది. అయితే గ‌తంలో ఝాన్సీ ఓ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుంద‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రిగింది. అలాగే రైడింగ్ లో ఆమె అడ్డంగా దొరికిపోయింద‌ని.. పోలీసులు ఝాన్సీ అరెస్ట్ చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఝాన్సీ తొలిసారి స్పందిస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

`నేను ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని, రైడింగ్ లో పోలీసుల‌కు పట్టుబడ్డానని వార్తలు రాశారు. అవ‌న్నీ ఫేక్‌. రైడింగ్ లో దొరికితే నేను ఇప్పుడు ఇక్కడ ఉండను కదా. అలాంటి చెత్త వార్త‌ల‌ను ఎవ‌రు, ఎందుకు రాయించారో నాకు తెలుసు. దానికి వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. నాకు అన్యాయం చేసిన వాళ్లకు నా శాపం తప్పకుండా తగులుతుంది. నాపై వచ్చిన ఈ తప్పుడు రాతల వల్ల‌ ఒక పదవి కోల్పోయాను. చాలా కాలంగా యూనిసెఫ్ తరపున వ‌ర్క్ చేస్తున్నాను. నన్ను కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని వారు అనుకున్నారు. కానీ, పుకార్ల కారణంగా వారు నన్ను తప్పుగా అనుకోని నాకు ఆ పదవి ఇవ్వలేదు. దాని వలన పైసా నష్టం లేక‌పోయినా చాలా బాధ కలిగించింది` అంటూ ఝాన్సీ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest