అనసూయ పై షాకింగ్ కామెంట్లు చేసిన హీరోయిన్..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూనే ఉంది.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పైన వేసే సెటైర్ల విషయంతో పలు రకాల ట్రోల్ కి గురవడమే కాకుండా అందుకు దీటుగా సమాధానాలను తెలియజేస్తూ ఉంటోంది. ఆమెను కావాలనే వెక్కిరిస్తూ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు.ట్విట్టర్లో అయితే ఆంటీ అనే పదం బాగా ట్రెండ్ అయిపోయింది. ఈ పదం పైన వేలకొద్దీ ట్వీట్స్ వస్తూనే ఉన్నాయి.

Kasthuri Shankar-Anasuya: ಪುಷ್ಪ ಖ್ಯಾತಿಯ ಅನಸೂಯ ಆಂಟಿ ಎಂದರಾ ಹಿರಿಯ ನಟಿ?
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అనసూయ కి ఎవరైనా ఆంటీ అని పిలిస్తే చాలా ఫైర్ అయిపోతుంది అలా పిలిచినందుకు కొంతమంది నేటిజన్ల పైన కూడా ఈమె పోలీస్ కేసు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి.. ఆంటీ అనే పదంలో ఏమి తప్పు ఉంది ఇంత చిన్న విషయానికి అంత రెచ్చిపోవాలా అంటూ మరి కొంతమంది నెటిజెన్స్ అనసూయను తప్పుపడుతున్నారు. రీసెంట్గా ఈ వివాదంపై గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ కస్తూరి కూడా స్పందించింది..

కస్తూరి మాట్లాడుతూ చిన్నపిల్లలు ఆంటీ అని పిలవడం లాంటి తప్పులేదు అది వాళ్ళ దృష్టిలో గౌరవంతో పిలిచినట్టు ఉంటుంది.. అంతేకానీ దున్నపోతుల ఉన్నవాళ్లు వచ్చి ఆంటీ అని పిలిస్తే అది చాలా పెద్ద తప్పు.. ఆంటీ అనే పదం కొన్నిసార్లు చెడ్డ అర్థాలకు కూడా దారితీస్తుంది. ఒక స్త్రీని మర్యాదగా పిలవాలి అంటే ఆంటీ అనే పదం అవసరం లేదు అమ్మ అని పిలవండి లేకపోతే ఎంతో మంచి పదం గారు అని పిలవండి అంటూ తెలిపింది. అవన్నీ వదిలేసి ఆంటీ అని పిలవడం ఏమిటి.. హీరోలను మీరు అంకుల్ అని పిలవగలరా అంటూ రేచ్చిపోయింది. దీంతో అనసూయకు మద్దతుగా తాను నిరుస్తానంటూ కామెంట్లు చేయడం జరిగింది కస్తూరి.