`ఆదిపురుష్‌` టికెట్స్ పై బంప‌ర్ ఆఫ‌ర్.. ఒకటి కొంటే మ‌రొక‌టి ఫ్రీ!!

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీతగా న‌టించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే అల‌రించ‌బోతున్నాడు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. అయితే టీజ‌ర్ ను ఎన్నో విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న చిత్ర టీమ్‌.. తాజాగా ట్రైల‌ర్ తో ప్ర‌శంస‌లు అందుకున్నారు. రెండు రోజుల క్రితం విడుద‌లైన ట్రైల‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. రాఘవ రామునిగా బాక్సాఫీస్ కుంభస్థలానికి ప్ర‌భాస్ గురి పెట్టాడ‌ని ట్రైలర్ తో స్ప‌ష్ట‌మైంది. విడుద‌ల‌కు కొత్తి రోజుల స‌మ‌య‌మే ఉండ‌టంతో.. మేక‌ర్స్ వ‌ర‌ల్డ్ వైడ్ గా సినిమాపై మ‌రింత హైప్ పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆదిపురుష్ టికెట్స్ పై పేటీఎం సంస్థ బంప‌ర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే ఓ టికెట్ రేటుతో రెండు టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని క‌ల్పించింది. అంటే ఒక టికెట్ కొంటె మ‌రొక‌టి ఫ్రీ అన్న‌మాట‌. ఈ విషయాన్ని ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉంటుంది. ఈ డీల్ లో భాగంగా ముందుగా రూ. 100 చెల్లిస్తే ప్రోమో కోడ్ వస్తుంది. టికెట్ బుక్ చేసుకునే ముందు దాన్ని అప్లై చేస్తే రూ. 400 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ. 350 ధ‌ర ఉన్న టికెట్ కే ఈ ఆఫ‌ర్ వర్తిస్తుంది. అంటే రెండు టికెట్లు బుక్ చేయాల్సి వస్తే ట్యాక్స్ తో కలిపి రూ. 700 పైగా అవుతుంది. అదే పేటీఎం ఆఫర్ కోడ్ ని ఉపయోగిస్తే సగానికి తగ్గే అవకాశం ఉందన్నమాట. కాబ‌ట్టి, ఈ ఆఫ‌ర్ ను మీరు కూడా వినియోగించుకోండి. జూన్ 16న థియేట‌ర్స్ లో ఆదిపురుష్ ను ఎంజాయ్ చేయండి.