చెన్నైలో చైతూను ఘోరంగా అవ‌మానించిన స‌మంత ఫ్యాన్స్‌..!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడం ఎంతటి సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత ఆమె ఫ్యాన్స్ చైతూపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహంతోనే తాజాగా చైతూను చెన్నైలో సమంత అభిమానులు ఘోరంగా అవమానించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. మే 12న తెలుగు తో పాటు తమిళంలోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలో కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

అయితే ఈ ఈవెంట్ లో చైతు స్టేజ్ పై మాట్లాడుతుండగా.. ఆడియన్స్ లో ఒక గుంపుగా కూర్చున్న‌ కొంతమంది సమంత.. సమంత అంటూ గట్టిగా నినాదాలు చేశారు. స్పీచ్ ఇస్తున్న చైతూను డిస్ట‌బ్ చేసేందుకు సమంత ఫ్యాన్స్ తెగ ప్రయత్నించారు. అయినా సరే చైతు తన స్పీచ్ ఆపకుండా కంటిన్యూ చేశాడు. నిజానికి సోషల్ మీడియా లో వీళ్లిద్దరి అభిమానుల మ‌ధ్య‌ వార్స్ న‌డుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా చైతూనే అవ‌మానించేందుకు క‌స్ట‌డీ ఈవెంట్ లో సామ్ ఫ్యాన్స్ అలా చేశార‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest