NTR: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి 4 సర్ప్రైజెస్..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా హిట్లు కొడుతూ చాలా స్పీడ్ గా ఉన్నారు.RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే లెవెల్లో తెరకెక్కించాలని పలు సన్నహాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివతో 30వ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులలో ఫుల్ జోష్ కనిపిస్తోంది.

Jr NTR Takes LA By Storm! Fans Shower His With Flowers & "Jai NTR” Slogans  As He Arrives For Oscars 2023

దీంతో అప్పుడే అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని NTR -30 వ టైటిల్ పోస్టర్ని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీంతోపాటు ఎన్టీఆర్ అభిమానులను సర్ప్రైజ్ చేసే మరికొన్ని ప్లాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని WAR -2 గా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం .అలాగే ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా నుంచి కూడా ఒక అప్డేట్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవే కాకుండా ఎన్టీఆర్ నటించబోయే మరొక ఫ్యూచర్ ప్రాజెక్టుకు సంబంధించి తన బర్తడే రోజున అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ ,బుచ్చిబాబు, వెట్రిమారన్ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈసారి మాత్రం ఎన్టీఆర్ బర్త్డే చాలా సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది మరి ఏ విధంగా అభిమానులను ఖుషి చేస్తాయో చూడాలి మరి. ఎన్టీఆర్ చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లేవలోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తూ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.