అంబటి సీటుకు ఎసరు..సత్తెనపల్లిలో రెడ్డి నేతకు ఛాన్స్.!

వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కష్టమని జగన్ ముందే తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని చెప్పారు. అలాగే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు సైతం సీటు కష్టమే అంటున్నారు. లేదంటే వారి సీట్లు మారుస్తామనే ప్రతిపాదనలు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా? లేదా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది.

ఇప్పటికే అంబటిపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనకు సీటు ఇవ్వకపోవడమా? లేక వేరే సీటుకు పంపడమో చేస్తారని తెలుస్తోంది. అయితే ఎప్పుడో 1989లో ఒకసారి గెలిచిన అంబటి మళ్ళీ 2019లో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయి. అసలు సత్తెనపల్లి సీటు దక్కుతుందో క్లారిటీ లేదు. ఈ సీటు రెడ్డి వర్గం నేతకు ఇవ్వాలని జగన్ చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే సత్తెనపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి వైసీపీలో చేరారు.

తన కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. యర్రం వెంట..అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారు.  అయితే యర్రం వైసీపీలో చేరడంతో అంబటి సీటుకు ఎసరు తప్పదని ప్రచారం జరుగుతుంది. గతంలో యర్రం కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..తర్వాత రాజకీయాలకు దూరమైన ఈయన..ఇప్పుడు వైసీపీలో చేరారు.

పైగా సత్తెనపల్లిలో కాపు, రెడ్డి వర్గాల హవా ఉంది. ఒకవేళ టి‌డి‌పి-జనసేన కలిస్తే కాపు ఓట్లు వైసీపీకి కలిసిరావు..ఈ క్రమంలో రెడ్డి వర్గం నేతకే సీటు ఇవ్వాలనే ప్రతిపాదన వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే యర్రం లేదా ఆయన తనయుడు పోటీ చేయవచ్చని ప్రచారం వస్తుంది. మరి అప్పుడు అంబటిని వేరే సీటుకు పంపిస్తారా? లేక సీటు ఉండదా? అనేది చూడాలి.

Share post:

Latest