తూర్పులో వైసీపీకి పొత్తు దెబ్బ..టీడీపీ-జనసేన ఆధిక్యం!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఉన్న జిల్లా. ఈ జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఆధిక్యం సాధించిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అదే జరిగింది. జిల్లాలో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు సాధించింది. అయితే ఈ సారి పరిస్తితి హోరాహోరీగా ఉంది. మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది.

ఇటీవల వచ్చిన ఓ సర్వేలో అదే తేలింది. జిల్లాలో 19 సీట్లలో టి‌డి‌పి 6, వైసీపీ 6 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని, జనసేన 4 సీట్లు గెలుచుకోవచ్చని, 3 సీట్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య పోరు ఉంటుందని తేలింది. అయితే ఈ ఫలితం ఎవరికి వారు విడిగా పోటీ చేస్తే..అదే సమయంలో టి‌డి‌పి-జనసేన గాని కలిసి పోటీ చేస్తే ఫలితాలు మారిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి..టి‌డి‌పి-జనసేన కలిసి 15 సీట్లు గెలుచున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

అంటే పొత్తు ప్రభావం ఆ రేంజ్ లో ఉంటుంది. ఇటీవల సర్వేలో ఎవరెన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందో ఒకసారి చూస్తే..టి‌డి‌పి 6..పెద్దాపురం, రాజమండ్రి సిటీ, ప్రత్తిపాడు, ముమ్మిడివరం, అమలాపురం, జగ్గంపేట సీట్లు..ఇక వైసీపీ గెలిచే 6…కాకినాడ సిటీ, అనపర్తి, తుని, రామచంద్రాపురం, రంపచోడవరం, రాజానగరం సీట్లు..జనసేన గెలిచేవి రాజమండ్రి రూరల్, రాజోలు, పిఠాపురం, కొత్తపేట..టఫ్ ఫైట్ ఉన్న సీట్లు..పి.గన్నవరం, మండపేట, కాకినాడ రూరల్ సీట్లు.

అయితే పొత్తు ఉంటే వైసీపీ గెలుపు అవకాశం ఉన్న సీట్లలో…కాకినాడ సిటీ, రాజానగరం, రామచంద్రాపురం సీట్లతో పాటు..టఫ్ ఫైట్ ఉన్న సీట్లు మూడు టి‌డి‌పి-జనసేన గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే తూర్పులో వైసీపీకి భారీ దెబ్బ తప్పదు.