సిద్ధార్థ్ తో ప్రేమాయణం పై ఊహించని ఆన్సర్ ఇచ్చిన అదితి..!!

తెలుగు ప్రేక్షకులకు నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటాడు.. తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరి తో డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం పైన ఇంతవరకు వీరిద్దరూ ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతం వీరిద్దరి కెరియర్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గలేదని చెప్పవచ్చు. కానీ వీరి వ్యక్తిగత కారణాలవల్ల సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వైరల్ గా మారుతూనే ఉన్నారు. తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అదితి సిద్ధార్థ రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలను స్పందించాలని.. విలేకరి కోరగా అందుకు భిన్నంగా సమాధానాన్ని ఇచ్చింది అదితి.. వాటి గురించి తెలుసుకుందాం.

Siddharth dating Aditi Rao Hydari? Viral video of actor warning paps from  clicking them sparks speculations | Masala News – India TV
అదితి మాట్లాడుతూ.. అందరితో చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే నేను తప్పకుండా చెబుతాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక దానిపైన ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి విషయాల పైన ఉండవచ్చు. కానీ చాలామందికి మమ్మల్ని స్క్రీన్ పైన చూడడమంటే ఇష్టము.. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి మా పనిని మేము ప్రేమించాలి అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్ అందించగలము అదే మాకు ముఖ్యమంటూ తెలియజేసింది..

అయినప్పటికీ కూడా సిద్ధార్థ తో ప్రేమాయణం గురించి స్పందించాలని విలేకరి కోరగా.. మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇక నేనేమి చెప్పాలి ఒకవేళ నేను ఏమి చెప్పినా మీకు నచ్చిన విధంగానే రాసుకుంటారు అంటూ అసహనాన్ని తెలిపింది. దీంతో ఇది ఆడియన్స్ ప్రశ్న మేడం అని అడగగా.. ఆడియన్స్ ఎవరు ఇలాంటి ప్రశ్న అడగలేదు మీరే నన్ను అడుగుతున్నారు అంటూ తెలియజేసింది. దీంతో ఈ విషయం మరింత వైరల్ గా మారుతోంది.

Share post:

Latest