ఆదిరెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టినట్లేనా….!

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఏమయ్యారు… ఆమె ఎక్కడ ఉన్నారు… రాజమండ్రి సిటీ పరిధిలో పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటీ… ఎమ్మెల్యే మామ… మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చంద్రబాబు అవకాశం ఇస్తారా… ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలివే. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భవానీ… వైసీపీ హవాలో […]

ఆ నలుగురే కీలకం… ఇలా అయితే ఎలా సారూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే చివరికి కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు… ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,300 కిలోమీటర్లు […]

జగన్ బాటలో కేసీఆర్… సక్సెస్ అవుతారా….!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ… 2009లోనే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన జగన్… ఆ తర్వాత వైసీపీ స్థాపించారు. 2012 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న జగన్… 2019లో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సీటు దక్కించుకున్నారు. తొలి నుంచి తనదైన శైలిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు జగన్. […]

ఆ వారసులకు జగన్ లైన్ క్లియర్..?

వచ్చే ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని బరిలోకి దింపాలని చూస్తున్న విషయం తెలిసిందే. కుదిరితే తమ వారసులతో పాటు తాము సీటు తీసుకుని పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇంకా వారసులకు సేతు ఫిక్స్ చేయలేదు. సీనియర్ నేతలని నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తనతో పాటే పోటీ చేయాలని అంటున్నారు. దీంతో వారసుల అంశం తేలడం లేదు. ఇప్పటికే పలువురు వారసులు సీటు రేసులో ఉన్నారు. ధర్మాన […]

బాబు ప్రాజెక్టు పాలిటిక్స్..జనం నమ్ముతారా?

జగన్ ప్రభుత్వం టార్గెట్ గా గత నాలుగేళ్లుగా చంద్రబాబు విమర్శనస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. సందు దొరికితే చాలు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ విరుచుకుపడుతున్నారు. జగన్ మంచి చేసిన వాటిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బాబు కొత్త రూట్ వెతుక్కున్నారు. జగన్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని, అసలు ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టలేదని, తమ హయాంలోనే భారీగా ఖర్చు పెట్టమని ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి […]

ఎన్నికల వరాలు..కేసీఆర్ పక్కా ప్లాన్.!

మొత్తానికి ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ ప్రభుత్వం..ప్రజలపై వరాల జల్లు కురిపించింది. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో..ప్రజలని ఆకర్షించే విధంగా కే‌సి‌ఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. దీంతో ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. ఈ అంశం రాజకీయంగా కూడా బి‌ఆర్‌ఎస్ […]

మణిపుర్ ఘటనపై సుప్రీం సీరియస్… మరి కేంద్రం వివరణ..?

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించింది సుప్రీంకోర్టు. మహిళలపై జరిగిన ఈ దారుణం అత్యంత భయంకరమైందని అభిప్రాయపడింది. ఇంతకీ.. అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలేంటి? దానిపై కేంద్రం ఇచ్చుకున్న వివరణ ఏంటి? మణిపూర్‌ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం చేసింది సుప్రీంకోర్టు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అన్ని రోజులు పట్టిందా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు […]

కేసీఆర్ చుట్టూ విమర్శలు… ఇలా అయితే ఎలా సారూ…!

రాష్ట్ర ప్రజలు వరదల్లో చిక్కి ఆర్తనాదాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పై దృష్టి పెట్టారు. ముంపు గ్రామాలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే ఆయన పక్క రాష్ట్రంలోరాజకీయాలు చేస్తున్నారు. నీట మునిగిన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేసే తీరక లేని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కి మహారాష్ట్రకు వెళుతున్నారు. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాలు బయటపెట్టని సీఎం ఈ నెల 3న మహారాష్ట్ర పర్యటనకు […]

ఏపీ కమలంలో కల్లోలం… నలుగురిపై వేటు…!

కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. కమిటీలో జరుగుతున్న మార్పులు కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారాయి. నిన్నమొన్నటి వరకూ ఏపీ బీజేపీని నడిపిన ఆ నలుగురిలో.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు. మరో ఇద్దరిని రేపో, మాపో సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ బీజేపీ నాయకత్వం మార్పుతో ఆ పార్టీలోనే కాకుండా , అధికార పార్టీకి సైతం సెగ తగులుతోంది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర బీజేపీలో తమ వారు నేతలుగా ఉండటంతో అధికార పార్టీ నేతలు తెగ సంబరపడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ […]