ఏపీ కమలంలో కల్లోలం… నలుగురిపై వేటు…!

కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. కమిటీలో జరుగుతున్న మార్పులు కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారాయి. నిన్నమొన్నటి వరకూ ఏపీ బీజేపీని నడిపిన ఆ నలుగురిలో.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు. మరో ఇద్దరిని రేపో, మాపో సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ బీజేపీ నాయకత్వం మార్పుతో ఆ పార్టీలోనే కాకుండా , అధికార పార్టీకి సైతం సెగ తగులుతోంది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర బీజేపీలో తమ వారు నేతలుగా ఉండటంతో అధికార పార్టీ నేతలు తెగ సంబరపడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ […]

జగన్ దసరా ముహుర్తం… ఫలితం ఇస్తుందా…!

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వెళ్తారని ఓ సారి… కాదు కాదు.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జమిలీ ఎన్నికలు మరోసారి పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 ఎన్నికల సమయంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో […]

జగ్గయ్యపేట టీడీపీలో నేతల సిగపట్లు…!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ… ముందస్తు పుకార్లు వినిపిస్తున్నాయి. గతానికి పూర్తి భిన్నంగా నేతలంతా ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక నియోజకవర్గ స్థాయి నేతలైతే ఎన్నికల్లో టికెట్ కోసం అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. కీలక నియోజకవర్గాల్లో కూడా ఈ సారి టీడీపీ గెలుపు కష్టమనే మాట బలంగా వినిపిస్తోంది. రాజధాని పరిధిలో తమకు తిరుగు లేదని […]

సిక్కోలు టీడీపీలో ఆధిపత్య పోరు… రింగ్ లీడర్ గ్రూప్ పాలిటిక్స్…!

సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రంగంలో ఎవరుంటారు అనే చర్చ జోరుగా నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వై నాట్ 175 అని జగన్ అంటుంటే… వై నాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు. ఇదే మాటను స్ఫూర్తిగా తీసుకుని ఇరుపార్టీల నేతలు జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. వైసీపీ తరఫున సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు లేదా ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పోటీ […]

పేరు రాబిన్ శర్మది… పెత్తనం మాత్రం ఆ నేతదే…!

తెలుగుదేశం పార్టీ నేతల జాతకం మొత్తం రాబిన్ శర్మ చేతుల్లో ఉంది అనేది బహిరంగ రహస్యం. నిజమే…. తెలుగుదేశం పార్టీ నేతల పనితీరు గురించి ప్రతి నెలా రాబిన్ శర్మ టీమ్ సర్వే నిర్వహించి… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ టీమ్ పని చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే నేతల గెలుపు ఓటములతో పాటు బలబలాల గురించి కూడా […]

ఎన్టీఆర్ సొంత గడ్డ..వైసీపీ అడ్డా..మళ్ళీ టీడీపీ అస్సామే.!

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు..దివంగత ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక నిమ్మకూరు ప్రస్తుతం పామర్రు నియోజకవర్గంలో ఉంది. అంతకముందు పామర్రు మండలం గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. దీంతో అక్కడ ఎన్టీఆర్ పోటీ చేసి సత్తా చాటారు. తర్వాత టి‌డి‌పి హవా కొనసాగుతూ వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గుడివాడ అలాగే ఉంది..పామర్రు సెపరేట్ నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే ఇలా ఎన్టీఆర్ సొంత గడ్డగా ఉన్న పామర్రులో టి‌డి‌పి ఇంతవరకు గెలవలేదు. 2009లో […]

భీమిలిలో టీడీపీ వర్సెస్ జనసేన..అవంతికి అడ్వాంటేజ్.!

భీమిలి నియోజకవర్గం టి‌డి‌పి కంచుకోట…ఇక్కడ 1983 నుంచి 1999 వరకు వరుసగా టి‌డి‌పి గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో మళ్ళీ టి‌డి‌పి జెండా ఎగిరింది. 2019లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఈయన 9 వేల ఓట్ల తేడాతో గెలిస్తే..జనసేనకు 24 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పికి నష్టం జరిగింది. అయితే ఈ సారి భీమిలిలో పోరు రసవత్తరంగా […]

తణుకులో హోరాహోరీ..అరిమిల్లి వర్సెస్ కారుమూరి..లీడ్ ఎవరిది?

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది..కానీ ఈ సారి టి‌డి‌పి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. అలా అని వైసీపీ తేలికగా వదిలే ఛాన్స్ లేదు. మళ్ళీ టి‌డి‌పిని చితు చేసి గెలవాలని చెప్పి చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ సారి తణుకు నియోజకవర్గంలో ఫైట్ హోరాహోరీగా సాగనుంది. గత ఎన్నికల్లో తణుకులో వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు, […]

విశాఖపై జగన్ ఫోకస్..వైసీపీకి ప్లస్.!

విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి..జగన్ అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకోస్తున్న విషయం తెలిసిందే. విశాఖని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎలాగో సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపై మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖ నుంచి కంపెనీలని తరిమేశారని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా జగన్..కొత్తగా విశాఖకు […]