కాంగ్రెస్‌లోకి తుమ్మల..షర్మిలకి నో క్లారిటీ?

బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని కే‌సి‌ఆర్ ప్రకటించడంతో..ఆ పార్టీలో సీట్లు దక్కని సీనియర్ నేతలు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మరి కొందరు అదే దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో టి‌డి‌పిలో ఉండగా తిరుగులేని నేతగా ఉన్న ఈయనకు బి‌ఆర్‌ఎస్ లో అనుకున్న మేర ప్రాధాన్యత దక్కడం లేదు. మొదట మంత్రి పదవి లాంటివి దక్కిన..2018లో ఓడిపోయాక ఆయన్ని పక్కన పెట్టేశారు.

కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. అయినా సరే తుమ్మల పార్టీ మారలేదు. ఇటీవల కే‌సి‌ఆర్ సీట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తుమ్మల ఆశిస్తున్న పాలేరు సీటుని కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి కేటాయించారు. దీంతో తుమ్మలకు సీటు లేదని తేలిపోయింది. ఈ క్రమంలోనే తుమ్మల అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయనతో బి‌జే‌పి, కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో తుమ్మల కాంగ్రెస్ వైపు రావచ్చు అని ప్రచారం ఉంది. అదే జరిగితే పాలేరు సీటు ఆశిస్తున్న షర్మిల పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు. కే‌సి‌ఆర్ సర్కార్ పై పోరాటం చేస్తున్న ఆమె..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆమె పాలేరు సీటు ఆశిస్తున్నారు. తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే పాలేరు సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో షర్మిల పొజిషన్ ఏంటి అనేది తెలియడం లేదు. పోనీ తుమ్మలని ఖమ్మం అసెంబ్లీ సీటుకు పంపితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూడాలి మరి తుమ్మల, షర్మిల కాంగ్రెస్ లోకి వస్తారో లేదో.