నేషనల్ క్రష్‌ రష్మికకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?

నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న‌కు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రష్మిక ప్రస్తుతం తెలుగు సినిమాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను, హ్యాబిట్స్, హాట్ ఫోటోషూట్స్‌ని షేర్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన జోడిగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పుష్పా సినిమాకు అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు నటించిన నటులు కూడా మరోసారి ట్రెండ్ అవుతున్నారు.

రష్మిక సినిమాలో తన పాత్రకు న్యాయం చేయడం కోసం ప్రాణం పెట్టి నటించడం కోసం తాను ఎంతగా బాడీ వర్కౌట్లు చేసిందో ఇప్పటికే వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్భంగా తనకి ఇష్టమైన సౌత్ ఇండియన్ డిష్ గురించి కూడా రివీల్ చేసింది రష్మిక. సాంబార్, రసం, పప్పు, పెరుగు ఇలా.. అన్నం తో కలిపి తీసుకునేది ఏదైనా తనకి ఇష్టమైన ఆహారమని చెప్పుకొచ్చింది.