ఫేస్ గ్లో రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..!!

మొహం కాంతివంతంగా కనిపించడానికి అమ్మాయిలు ఎన్నో టిప్స్ వాడుతూ ఉంటారు. కానీ ఏది అంతగా వర్కౌట్ కాదు. చిన్న వయసు నుంచే ముఖం కాంతివంతంగా కనిపించకుండా పోతుంది. దీనికి రూపాయి ఖర్చు లేకుండా మొహాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. మొహాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు, అలోవెరా చర్మానికి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని వేరువేరుగా మొహానికి అప్లై చేసి ఉంటారు కానీ… రెండు కలిపి అప్లై చేయడం వల్ల మొహం మరింత కాంతివంతంగా తయారవుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు చర్మాన్ని మృదువుగా, మచ్చలు రాకుండా, తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. అలోవెరా చర్మంపై ఉన్న డస్ట్‌ని క్లీన్ చేస్తుంది.

మొహం కాంతివంతంగా మారడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ మిశ్ర‌మాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, అలోవెరా, తేనె కలిపిన మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నుంచి 25 నిమిషాల వరకు ఉంచుకొని ఆ తరువాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొహం కాంతివంతంగా తయారవుతుంది.