” రాజాసాబ్ “.. ఫ్యాన్స్ నుంచి డైరెక్టర్ మారుతి ఊహించని బంపర్ సర్ప్రైజ్

ప్ర‌భాస్ నటించిన లేటేస్ట్ మూవీ ది రాజాసాబ్ నుంచి నిన్న సెకెండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈట్రైల‌ర్‌తో.. ఫ‌స్ట్‌ వచ్చిన ట్రైలర్‌తో పోలిస్తే.. మరింత స్పష్టంగా కథను రివీల్ చేశారు. విజువల్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే 2వ ట్రైలర్ తో సినిమాపై హైప్ మ‌రింత‌గా పెరిగింది. ఈ ప్ర‌భావంతోనే ప్రభాస్ ఫ్యాన్స్.. బైరెక్ట‌ర్ మారుతిని తెగ ఎత్తేస్తున్నారు. మారుతి ఇంటికి ఫ్యాన్స్ ఇప్ప‌టికే ఓ సర్‌ప్రైజ్ పంపించడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గ‌త మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ‘రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన సినిమాతో ఎక్క‌డ డిసప్పాయింట్ చేయలేదని.. తన ఫ్యాన్స్ రెస్పాన్స్‌కు కృతజ్ఞత తెలియ‌జేశారు. కోండాపూర్‌లోని తన ఇంటి అడ్రస్ కూడా షేర్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే లేటెస్ట్ ట్రైలర్ చూసి తెగ సంబరపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్‌.. మారుతి ఇంటికి బిర్యానీ పార్సిల్స్ పంపుతు సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ విషయాన్ని మారుతి తన ట్విటర్ వేదిక‌గా షేర్ చేశారు. ట్రైలర్ కేవలం ఒక్క సీన్ అయినా.. ఈ రేంజ్‌లో అభిమానాన్ని చూపించడంతో మూవీ విడుదల తర్వాత ఇంకెన్ని పార్సిల్స్ వస్తాయో ఊహించడానికి క‌ష్ట‌మ‌వుతుందంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుండ‌గా.. ప్రీమియర్ షో జనవరి 8 రాత్రి ప‌డిపోతుంది. హారర్-ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంగీతం తమన్ అందించారు.