టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడుగా తనకంటూ స్పెషల్ ఇమేజస్ క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్.. కేవలం దర్శకుడిగానే కాదు.. తన భార్య సాయి సౌజన్యతో కలిసి.. ఫార్చున్ ఫర్ సినిమాస్ బ్యానర్ పై పలు సినిమాలను కూడా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ కు.. టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీకి మధ్యన మంచి బాండ్ ఏర్పడింది. ఇండస్ట్రీలో ఇప్పటికే వీళ్లిద్దరూ సక్సెస్ఫుల్ దర్శక, నిర్మాతల ద్వయంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి పలు ప్రాజెక్టులకు పని చేశారు. ఇప్పటికీ పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమా, సీతారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా పలు సినిమాలను రూపొందించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే.. వీళ్లిద్దరి మధ్యన ఉన్న బాండ్ తో త్రివిక్రమ్ నాగ వంశీకి ఓ మాస్ వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ షేర్ చేసుకున్నాడు. మరికొద్ది రోజుల్లో నాగ వంశీ ప్రొడ్యూసర్ గా.. అనగనగా ఒక రోజు మూవీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి, నవీన్ పోలిశెట్టి కాంబోలో రూపొందిన ఈ సినిమా జనవరి 14న ఆడియన్స్‌ను పలకరించనుంది. దీంతో నాగావంశీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇంటర్వ్యూలో సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన సలహాలు గురించి ఆయన ప్రస్తావించాడు. 2025 సెకండ్ హాఫ్ లో మా సంస్థ నుంచి వచ్చిన కొన్ని సినిమాస్ సరిగ్గా సక్సెస్ అవ్వలేదని.. త్రివిక్రమ్ గారు నాతో దీనిపై మాట్లాడారని.. అన్నిట్లో వేలు పెట్టకు బాబు అంటూ సూచించారని చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్ గారు మనకంటూ ఓ కోర్ జోనర్ కదా.. దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్దాం. ఆడియన్స్ కూడా ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారని వివరించారని.. ముఖ్యంగా వీళ్లు ఆ జానర్ చాలా బాగా చేస్తారని నమ్మకం వచ్చిందని.. త్రివిక్రమ్ చెప్పారంటూ నాగ వంశీ వివరించాడు. అందుకే ఈ జానర్ మిస్ చేయకూడదని.. అదే స్పేస్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నాగ వంశీ వివరించాడు. అన్ని జానర్లని వేలు పెట్టకుండా.. ప్రయోగాలు చేయకుండా.. మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలని త్రివిక్రమ్ తనతో అన్నట్లు వివరించాడు. ఆ బాటలోనే ఇప్పుడు మేమిద్దరం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించాడు. ఇక త్రివిక్రమ్ సినిమాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లానే ఉంటాయి. ఇప్పటికే ఆ సినిమాలు చాలానే సక్సెస్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్, నాగ వంశీ కాంబోలో వచ్చే సినిమాలన్నీ అదే జానర్ లో ఉంటాయని టాక్ వైరల్ గా మారుతుంది.

