రాజాసాబ్ – మన శంకర వరప్రసాద్ గారు.. రెండిటిలో భారీ హైప్ దేనికి..!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ హీరోగా.. యంగ్‌ డైరెక్టర్ మారుతి డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయినా టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ప్రభాస్ త‌న కెరీర్‌లోనే మొదటిసారి డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆడియన్స్‌ను పలకరించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. కథ పాతగానే ఉన్నా.. అందులో హారర్ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ జత చేసి.. విజువల్స్‌తో ప్రేక్షకులను మెప్పించాలని మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఫుల్ కమర్షియల్ హంగులతో తెర‌పైకి తీసుకురానున్నాడు.
చిరంజీవి కూడా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్, చిరు మధ్య స్ట్రాంగ్ పోటీ నెలకొననుంది. ఈ క్రమంలోనే.. ప్రభాస్ తన రాజాసాబ్ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో.. ప్రేక్షకులకు చూపించాడు. ఈ క్రమంలోనే.. ప్రజెంట్ రాజాసాబ్ మంచి హైప్‌తో దూసుకుపోతుంది. ఇక చిరంజీవి సినిమా నుంచి ట్రైలర్ రావాల్సి ఉంది. ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయితే రాజాసాబ్ వర్సెస్ శంకర్ వరప్రసాద్ గారు మధ్యన అసలు సిసల పోటీ మొదలవుతుంది. ఏ ట్రైలర్ బాగుంది.. ఏ సినిమాను మనం చూడాలి.. అని ఆడియన్స్ అంతా ఓ కన్ఫర్మేషన్‌కు వచ్చేస్తారు. ఈ రెండు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే కనుక.. ఓపెనింగ్స్ విషయంలో ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
చాలామంది ఆడియన్స్.. ఇద్దరు సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఆ సినిమాను ఎక్కువగా చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. దీంతో.. సినిమాకు కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు చిరంజీవి హీరోగా నటించడ‌మే కాదు.. కమర్షియల్ హంగులతో పాటు మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా సినిమాలో ఉన్నారు. అంతేకాదు.. నయనతార హీరోయిన్గా నటిస్తుండడం.. సినిమా ఫుల్ ఆఫ్ కామెడి ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న క్రమంలో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను చూడడానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపుతారు అనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక అనిల్ సినిమాలకు సంక్రాంతి సీజన్ అంటేనే మంచి గిరాకీ. క‌నుక ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సినిమాను చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే.. యూత్ మాత్రం అనిల్ మూవీస్‌ను క్రింజ్ కామెడీ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కనుక వీళ్లంతా రెబల్ స్టార్ రాజాసాబ్ సినిమాపై ఆసక్తి చెప్పే అవకాశం ఉంది.