సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కోట్లాదిమంది అభిమానాన్ని దక్కించుకున్నాడు. ఇక బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలు సక్సెస్, ఫ్లాప్‌లతో తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే.. బాహుబలి తర్వాత చాలాకాలం వరస ఫ్లాప్‌లను ఎదుర్కొన్న ప్రభాస్.. చివరిగా వచ్చిన సలార్, కల్కిలతో మంచి సక్సెస్ ని దక్కించుకున్నాడు.

ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇక రాజాసాబ్ వచ్చే ఏడాది.. సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఇక ఇలాంటి క్రమంలోనే కృష్ణంరాజు భార్య.. ప్రభాస్ పెద్దమ్మ ఆయన సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సినిమాలతో సంబంధం లేకపోయినా అప్పుడప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన శ్యామల దేవి.. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింంది. ప్రభాస్ సినిమాల్లో రెండు సినిమాలంటే నాకు అసలు ఇష్టం ఉండదని.. వాటిలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఏక్ నిరంజన్ ఒకటి.. ప్రభాస్‌ను ఇందులో అనాధగా ఎవరూ లేనట్లు చూపించడం అసలు నచ్చలేదు.

సినిమాలో అమ్మ లేదు నాన్న లేడు ఏక్ నిరంజన్ అంటూ సాగే సాంగ్ కూడా తనకు నచ్చదు అంటూ వివరించింది. ప్రభాస్ నటించిన సినిమాల్లో శ్యామలా దేవికి నచ్చని మరో మూవీ చక్రం. సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ ఆఖరికి చనిపోతాడు. ఇలాంటి విషాదకరమైన సన్నివేశాల్లో తన అబ్బాయిని చూడలేకపోయామని.. శ్యామలా దేవి వివరించింది. చక్రం చాలా మంచి కాన్సెప్ట్. కానీ.. నాకు నచ్చదు. ఆ సినిమాలో సన్నివేశాలు నేను భరించలేకపోయా అంటూ వివరించింది. ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే ఆమెకు నచ్చని రెండు సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకోలేకపోయాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాపులుగా మిగిలిలాయి.

