ఛాంపియన్ , శంబాల, దండోరా,ఈషా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

2025 టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సెన్సేషనల్ హిట్స్ నమోదయ్యాయి. అత్యంత‌ తక్కువ బడ్జెట్‌తో వ‌చ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకున్నాయి. ఇక 2025.. తుది దశకు చేరుకుంది. మరో 4 రోజుల్లో ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పేసి.. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్న క్రమంలోనే.. లాస్ట్ వీకెండ్ లో క్రిస్మస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శంబాలకు హిట్ టాక్ రాగా.. ఛాంపియన్, దండోరా యావ‌రెజ్ టాక్‌ను దక్కించుకున్నాయి.

ఈషా సినిమాకు నెగటివ్ టాక్‌ వచ్చింది. ఇప్పుడు సినిమాల టాక్‌కు భిన్నంగా ఈ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఉండడం విశేషం. ముఖ్యంగా శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక ఛాంపియన్ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి యావరేజ్ టాక్‌ వచ్చినా.. మొదటిరోజు మాత్రం రూ.4.5 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని వైజయంతి మేకర్స్‌ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఆది సాయికుమార్ నటించిన శంబాల.. కంటెంట్ బాగుందని.. కచ్చితంగా హిట్ కొడతాడని రివ్యూలు వినిపించాయి.

Dandora Movie Review: శివాజీ 'దండోరా' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? |  సినిమా - News18 తెలుగు

ఈ సినిమాకు ఫస్ట్ రూ.3.3 కోట్ల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. దీన్ని మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. ఇక హారర్ మూవీ ఈషా.. రాజు వెడ్స్ రాంబాయి తో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రిగుణ్‌ ఈ సినిమాలో హీరోగా నటించారు. సినిమా స‌క్స‌స్‌ అందుకోలేకపోయింది. హారర్ కథ‌గా రిలీజ్ అయిన అడియ‌న్స్‌కు క‌నెక్ట్ కాలేదు. మరో మూవీ దండోరా. శివాజీ, నావదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. ఫస్ట్ డే యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఇక సినిమా కలెక్షన్ మాత్రం అంతంత గానే ఉన్నాయని.. రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. ఇక.. ఈ సినిమా అఫీషియల్ కలెక్షన్స్ టీం ప్రకటించాల్సి ఉంది.

Eesha Trailer Promises Intense Fear and Edge-of-the-Seat Thrills -  TeluguBulletin.com