టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది గంటలో ముగిమబోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా విన్నర్ ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి విన్నర్ రేస్‌లో ట్రోపీ ఎవరు అందుకోబోతున్నారు.. అనే అంశంపై ఇప్పటివరకు ఏ సీజన్‌లో లేని రేంజ్‌లో హైప్ మొదలైంది. ఈ క్రమంలోనే గ్రాండ్ ఫినాలలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. టాప్ 3లో కచ్చితంగా ఉంటాడని.. టైటిల్ కోసం గట్టి పోటీ ఇస్తాడని అభిమానులు భావించిన ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం అందరికి షాక్ కలిగించింది.
ఇంతకీ ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు ఇమ్మన్యూయెల్. జబర్దస్త్ కమెడియన్‌గా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చినా.. కింగ్ ఆఫ్ ఎంట్రటైనర్‌గా నిలిచాడు. టాస్క్‌లలోను తన సత్తా చాటుకుంటూ.. ఎవరిని తన మాటలతో నొప్పించకుండా ఆటతీరుతో హౌస్‌నే కాదు.. ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇమ్ము సడన్ ఎలిమినేషన్కు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారురు. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ మండిపడుతున్నారు. ఫైనల్ ఓటింగ్ లో ఊహించని విధంగా ఇమ్ముని 4వ స్థానంలో ఇంటి నుంచి బయటకు తీసుకురావడాని తాను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదట.

ఈ క్రమంలోనే ఎమోషనల్ అయ్యాడని.. కంటనీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హౌస్ లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే గుడ్ ఎంటర్టైనర్ ట్యాగ్ సంపాదించుకున్న ఇమాన్యుల్.. తన లేకపోతే షోలో కామెడీనే లేదనే స్టేజ్‌కు ఎదిగాడు. అంతేకాదు.. తనువంతు స్ట్రాంగ్ కాంపిటీషన్ గా నిలిచాడు. ప్రతి ఒక్క అంశంలోను తనదైన స్టైల్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఇమ్ము ఖచ్చితంగా టాప్ 2లో ఉంటాడని ఎంతోమంది భావించారు. కానీ.. సడన్ ఎలిమినేషన్.. అది కూడా నాలుగవ స్థానంలో హౌస్ నుంచి బయటకు రావడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతుంది.


