టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ – మారుతి కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్. హారర్ థ్రిల్లర్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేసేసారు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై.. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటివరకు బిజినెస్ పూర్తి కాలేదంటూ టాక్ నిటింట వైరల్‌గా మారుతుంది. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోలు సినిమాలంటే నిర్మాతలకు.. టేబుల్ ప్రాఫిట్స్, నాన్ ధియేటర్ కలెక్షన్, థియేటర్, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, సాటిలైట్ హక్కులంటూ అన్ని రకాల బిజినెస్ లు కూడా ముందే కంప్లీట్ అయిపోయేవి. కానీ.. ఇటీవల కాలంలో మొత్తం డైనమిక్స్ చేంజ్ అయిపోయాయి.
ఎంత పెద్ద సూపర్ స్టార్ మూవీ అయినా మార్కెట్లో బజ్ ఉంటేనే కొంటాము. అడ్వాన్సులు ఇస్తామని బయ్యర్స్ చెప్పేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా విషయంలో ఇదే జరిగింది. పవన్ కలుగ చేసుకుంటే గాని సినిమా రిలీజ్ కానీ పరిస్థితి. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏ స్టార్ హీరో సినిమాలకు రావని అంతా భావించారు. కానీ.. బోయపాటి – బాలయ్య అఖండ 2 సినిమాకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకు మళ్ళీ అదే పరిస్థితి మొదలైంది. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. ఫలితంగా.. సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ డీల్ ఇప్పటికీ పూర్తికాలేదు. మరో 20 రోజులు మాత్రమే సమయం ఉన్న థియేట్రికల్ బిజినెస్ పూర్తి కాకపోవడం అంటే.. రాజాసాబ్‌కు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అర్థమవుతుంది.
అంతేకాదు.. ఓటీటీ డీల్ కూడా.. అతి కష్టం పైన కంప్లీట్ అయిందట. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్లోనే ఓ సినిమాకు ఇంత కష్టంగా బిజినెస్ జరగడం మొదటిసారి. ఇప్పుడు రాజాసాబ్ నిర్మాత ముందున్న అతిపెద్ద సవాల్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకోవడం. ఇక సినిమాకు పీపుల్స్ మీడియాతో పాటు.. ఐవివై ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. కానీ.. పీపుల్ మీడియా అధినేత విశ్వప్రసాద్ తీరు నచ్చని ఆ సంస్థ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అంతేకాదు అప్పటివరకు ప్రాజెక్టు కోసం పెట్టిన రూ.250 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టులో వాళ్ళు పిటిషన్లు కూడా వేశారు. విశ్వప్రసాద్ ఇప్పటివరకు ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేసాడని.. వడ్డీ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది. మరి విశ్వప్రసాద్ ఆ వడ్డీ కూడా చెల్లించి క్లియరెన్స్ తెచ్చుకుంటాడా.. లేదా సినిమా చివరి నిమిషంలో వాయిదా వేస్తాడా.. చూడాలి.



