ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్ మూవీ. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఇద్దరి నటన మరవలేము. ఇక వీళ్లిద్దరి నాటు నాటు బీట్ సాంగ్స్, వెబ్ ఎప్పటికీ ఎవర్గ్రీన్. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రిలీజై ఇప్పటికే మూడేళ్లయిన.. అందరికీ చరణ్, తారక్ కాంబో మైండ్లో గుర్తుండిపోయింది. అలాంటి ఎన్టీఆర్, చరణ్ నుంచి మళ్లీ ఒక మూవీ వస్తే.. ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌ఆర్ఆర్ తర్వాత మళ్లీ తారక్, చెర్రీ కలిసి నటిస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు ఆరాటపడుతున్నారు.
కాగా.. నెల్సన్ దిలీప్ కుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా లెవెల్లో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా టాక్ ప్రకారం రజనీకాంత్ జైలర్ 2 కంప్లీట్ అయిన వెంటనే ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆయన ఫిక్స్ చేశాడట. ఆర్‌ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్, చరణ్‌లను.. మరోసారి ఈ సినిమాతో ఒకే ఫ్రేమ్ కు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్‌తో పాటు.. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలో మెరవన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నెల్సన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేయనున్నాడని.. ఈ ప్రాజెక్టులో హీరోగా ఎన్టీఆర్, చరణ్ కనిపించబోతున్నారంటూ ఇన్సైడ్ వర్గాల టాక్.

ఇక.. ఇప్పటికే స్టోరీని నెల్సన్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు వినిపించాడని.. వాళ్ళిద్దరూ పాజిటివ్గా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఆర్‌ఆర్ఆర్ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబోలో ఓ పాన్ ఇండియా లెవెల్ సినిమా తెరకెక్కనుంది అంటూ సమాచారం. దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కాంబో నెల్సన్ ప్లాన్ తో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందట. ఒక్కసారి దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే చాలు.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ అయ్యేలా హైప్ క్రియేట్ అవుతుంది.


