ఆ స్టార్ హీరోతో మృణాల్ ప్రేమాయణం.. లవ్ సింబల్స్ తో కన్ఫామ్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌, మాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు ఇప్పటివరకు నటించినా దాదాపు అన్ని సినిమాలతోనే మంచి సక్సెస్‌లు అందుకుంది. అంతేకాదు.. ప్రతి సినిమాలోను తన నటనతో ఆడియన్స్‌లో ప్రశంసలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా ఓ స్టార్ హీరోలతో ప్రేమాయణం నడుపుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ స్టార్ సెలబ్రెటీ మరెవరో కాదు.. కోలీవుడ్ హీరో ధనుష్. ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తర్వాత ధనుష్ రెండో పెళ్లి పై ఇప్పటికే చాలా వార్తలు అయ్యాయి.

Dhanush is just…': Mrunal Thakur reacts to dating rumours, reveals truth  behind Son of Sardaar 2 premiere video | Hindustan Times

ఇక చాలాకాలం నుంచి మృనాల్ ఠాగూర్ తోనే ధనుష్ ప్రేమాయ‌ణం నడుపుతున్నాడని.. త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ధనుష్, మౄణాల్‌ కూడా అంతే క్లోజ్ గా కెమెరా కంటపడుతూ వచ్చారు. వీళ్లిద్దరి మధ్య డేటింగ్ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న క్ర‌మంలో.. ఆ వార్తలకు మరింత ఆజ్యం పోస్తు.. మృణాల్ ఠాగూర్ ఇటీవల నటించిన ఓ సినిమా ఈవెంట్లో స్పెషల్ గెస్ట్ గా ధనుష్ సందడి చేశాడు. అంతేకాదు.. మృణాల్‌ బర్త్డే కూడా ధనుష్ హాజరవడం.. వీళ్ళిద్దరి మధ్యన ఏదో స్పెషల్ బాండ్ ఉందంటూ.. అందుకే ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయిన వీళ్ళిద్దరూ తరచూ కలుసుకుంటున్నారని.. క్లోజ్ గా ఉంటున్నారు అంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

Mrunal Thakur: Relationship Rumours with Dhanush | t2ONLINE

అయితే.. ఈ రూమర్లకు అనుగుణంగానే మృణాల్, ధనుష్ కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో ధనుష్ పెట్టిన ఎన్నో పోస్టులకు మృణాల్ రియాక్ట్ అవుతూ వచ్చింది. దీంతో.. వీళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుంది అన్న వార్తలకు మరింత బలం పెరిగింది. ఇలాంటి క్రమంలో మృణాల్‌ నటించిన లేటెస్ట్ మూవీ ధో దీవానే షహర్ మే సినిమా టీజర్ రిలీజ్ కాగా.. ఆ టీజర్‌ను మృణాల్ త‌న ట్విట‌ర్ వేదికగా పంచుకుంది. ఇక ఈ పోస్ట్‌పై ధనుష్ రియాక్ట్ అవుఎతూ చాలా బాగుందని కామెంట్స్‌ చేశాడు. మృణాల్ దానికి లవ్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చింది. ఈ కామెంట్ల దెబ్బకు.. డౌట్ లేదు వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు, కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారు, అందరూ అనుకున్నదే జరగబోతుంది, త్వరలోనే ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి నిజంగానే ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.