విడాకుల బాటలో నయన్.. విగ్నేష్ తో అంతలా విసిగిపోయిందా..!

సౌత్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ అనగానే నయనతార అందరికీ గుర్తుకు వచ్చేస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మ‌డు.. ముఖ్యంగా తమిళ్‌లో స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ అమ్మ‌డు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం స్పెషల్ పాపులారిటీ దక్కించుకున్న‌ నయనతార.. డైరెక్టర్ విగ్నేష్‌ శివ‌న్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. విగ్నేష్ కంటే ముందు.. శంభు, ప్రభుదేవలతో ప్రేమాయణం నడిపిన ఈ హాట్ బ్యూటీ.. పెళ్లి తర్వాత హవా కాస్త తగ్గించింది. ఆమె లైఫ్ అస్సలు సాఫీగా జరగలేదు. ఎన్నో వివాదాలను ఎదుర్కొంది.

ఇక గతంలో.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. నయన‌తార‌కు పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని.. విడాకులు ఖాయమని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార కూడా విడాకుల బాటలో అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను పంచుకుని ఆ పోస్టులో పెళ్లి జీవితం గురించి షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తెలివి తక్కువ వ్యక్తులను పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ పెద్ద మిస్టేక్ అని.. నీ భర్త చేసే పనులకు.. నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ రాసుకొచ్చింది.

కారణం.. పురుషులు సాధారణంగా మెచ్యూర్డ్‌ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్టులో పంచుకుంది. అయితే.. ఆమె చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం క్లారిటీ లేదు. దీంతో తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతుందంటూ నెటిజ‌న్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్ల‌పాటు.. రిలేషన్‌లో ఉన్న విగ్నేష్‌ను 2022లో వివాహం చేసుకుంది. ఇలాంటి క్రమంలో నయన్‌ చేసిన షాకింగ్‌ పోస్ట్ నెట్టింట వైరల్ అవడంతో.. వేణు స్వామి చెప్పిందే జరుగుతుందంటూ.. నెటిజ‌న్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విడాకుల వార్తల పైన విగ్నేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.