రష్మిక లైనప్ అదుర్స్.. స్టార్ హీరోలను మించిపోతున్న నేషనల్ క్రష్..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అందం, అభినయంతో పాటు.. పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. అలా.. అదృష్టం కలిసొచ్చి సక్సెస్‌లు అందుకున్న ముద్దుగుమ్మలు.. స్టార్ స్టేటస్‌తో దూసుకుపోతున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో.. ప్రస్తుతం నేషనల్ క్ర‌ష్‌గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన ఒకటి. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వరుస సక్సెస్ లను అందుకుంటూ దూసుకుపోతుంది. దాదాపు.. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన క్రమంలోనే.. నేషనల్ క్ర‌ష్‌గా తిరుగులేని ముద్ర వేసుకుంది రష్మిక.

తన సినిమాల్లో నటనతో పాటు.. అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. అంతేకాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకుంటూ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే.. అమ్మడు ఇప్పటికీ అదిరిపోయే క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంది. ఇంతకీ రష్మిక లైనప్ ఏంటి.. అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటిస్తున్న భారీ ప్రాజెక్టుల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. రష్మిక ప్రజెంట్ నటుడు క‌మ్‌ దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రనాథ్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్‌ ఫ్రెండ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అమ్మడు ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా.. ఈమె మైసా తో మరో లేడీ మాకు ఓకే చెప్పింది. ఈ మూవీ టీం సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే.. నెటింట‌ తెగ ట్రెండింగ్‌గా మారింది. ఇక ఈ పోస్టర్‌ను చూస్తే సినిమా భారీ మాస్ ఎంటర్టైనర్ అని క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాతో పాటు.. రష్మిక రెయిన్బో సినిమాలోను నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పుష్ప 3 సినిమా ఈమె లైన‌ప్‌లో ఇప్ప‌టికే ఉంది. ఇలా.. ప్రస్తుతం రష్మిక చేతిలో ఈ నాలుగు బడా ప్రాజెక్టులతో పాటు.. మరో రెండు మూడు క్రేజీ సినిమాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ స్టార్ హీరోలను మించి పోయే రేంజ్‌లో అమ్మడు బిజీ లైన‌ప్‌తో దూసుకుపోతుందంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు.. స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగానే.. రెమ్యూనరేషన్ కూడా భారీ లెవెల్‌లో అందుకుంటుంది రష్మిక.