సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది సక్సస్ సాదించాలని ఎంతోమంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఎన్నో ఇబ్బందులను.. కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే.. కొన్ని సందర్భాల్లో హీరోయిన్లు ఎంత టాలెంటెడ్ గా ఉన్నా.. అందం, అభినయంతో ఆకట్టుకుని సక్సెస్ లు రాకపోవడంతో సినిమాలకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్నా.. అవకాశాలను దక్కించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ముద్దుగుమ్మలు ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న స్టార్ బ్యూటీ ఒకటి. తన అందం, అభినయంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. నటనకు ప్రశంసలు అందుకుంది.
తను నటించినా సినిమాలతో మాత్రం వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. రవితేజ మిస్టర్ బచ్చన్‌తో హీరోయిన్్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచినా.. సినిమాలో అమ్మడి స్క్రీన్ ప్రజెన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ పై అమ్మడి ఫోకస్ పెరిగింది. ఇప్పటికే పలు భాషలో నటించిన అమ్మడు ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయినా.. తన గ్లామర్ తో ఆడియన్స్‌ను మెప్పిస్తు టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటుంది భాగ్యశ్రీ. ప్రస్తుతం ఆమె విజయ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఇదే కాదు.. శ్రీ లీలా మరో ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడంతో భాగ్యశ్రీ ఆ ప్రాజెక్టును కొట్టేసిందట. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు అఖిల్ నటిస్తున్న లెనిన్. ఇందులో శ్రీ లీల మొదట హీరోయిన్గా ఫిక్స్ అయిందని అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత.. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో.. ఆమె సినిమా నుంచి తప్పకుందట.
దీంతో భాగ్యశ్రీ ఈ ప్రాజెక్ట్‌లో ఎంట్రీ ఇచ్చిందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో పాటే రామ్ హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాతో ఆడియన్స్‌ను పలకరించింది. అంతేకాదు దుల్కర్ సల్మాన్ తో మరో సినిమాలో భాగ్యశ్రీ మెరవనుంది. ఇవే కాకుండా.. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా కోసం కూడా భాగ్యశ్రీని అప్రోచ్ అయ్యారని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే వాస్తవం అయితే మాత్రం.. అమ్మడు ప్రభాస్‌తో నటించే ఛాన్స్ కొట్టేసినట్టే. ఇక.. ఇప్పటికే ఫెయిల్యూర్ బ్యూటీగా ఐరన్ లెగ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న భాగ్యశ్రీకి.. టాలీవుడ్ పిలిచి మరి అవకాశాలు ఇస్తుంది అనడంలో అతి శయోక్తిలేదు. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది భాగ్యశ్రీ. ఇక ఈ సినిమాలన్నింటిలో ఒక్క సినిమాతో అయినా పర్ఫెక్ట్ హిట్ కొట్టి తన ట్యాగ్‌ను మార్చుకుంటుందేమో వేచి చూడాలి.