స్టార్ హీరో ధనుష్, సూపర్ సార్ రజనీకాంత్‌కు కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు స్టార్ హీరోలకు టాలీవుడ్‌లోను అదే లెవెల్లో ఫాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ మాజీ మామ, అల్లుళ్ళు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి రానుందంటూ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇక వీళ్ళిద్దరి కాంబోలో బడా ప్రాజెక్టులో రూపొందించేందుకు స్టార్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? అసలు ప్రాజెక్ట్ డిటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ హెచ్.వినోద్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ప్రస్తుతం వినోద్.. విజయ దళపతి హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా జననాయగన్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ముగ్గియనుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ మూవీ రాజకీయ నేపద్యంలో తెరపై ఆడియన్స్‌ను పలకరించనుందని సమాచారం. ఇప్పటికే.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ 2026 జనవరి 8 న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హెచ్. వినోద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ధనుష్ఠ్‌తో చేయనన్నట్లు సమాచారం. తాజాగా.. రజనీకాంత్‌తో కూడా ఓ ప్రాజెక్ట్ నటి్చనున్నాడంటూ టాక్ వైరల్‌గా మారింది. దానికి ప్రధాన కారణం ఇటీవల హెచ్. వినోద్.. రజినీకాంత్‌ను కలవడమే.
ఈ క్రమంలోనే ఇద్దరితో కలిసి సినిమా చేస్తున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌గా మారుతున్నాయి. అయితే.. ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనకగరాజ్‌తో కూలి సినిమా.. అలాగే నెల్సన్ డైరెక్షన్‌లో జైలర్ 2 సినిమాలు నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హెచ్.వినోద్ డైరెక్షన్‌లో మరో సినిమా నటిస్తాడా.. లేదా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఒకవేళ రజినీకాంత్ ఛాన్స్ ఇవ్వకపోతే ధనుష్‌తో ఈ సినిమా ప్లాన్ చేస్తాడు అంటూ టాక్ కూడా వైరల్ గా మారుతుంది. వీటిలో వాస్తవం ఏదో తెలియదు కానీ.. ఒకవేళ నిజంగానే రజిని, ధనుష్ కాంబోలో వినోద్ ఓ సినిమా రూపొందిస్తే మాత్రం ఈ సినిమా పై ఆడియన్స్ పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో నిజం ఏంటో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.