ఇకపై సమంత టాలీవుడ్లో కనిపించే ఛాన్సే లేదా..!

స్టార్ హీరోయిన్‌ సమంత.. సౌత్‌లో నెం 1గా రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాదిలోనే పలు వెబ్ సిరీస్ నటిస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయింది. అయితే మెల్లమెల్లగా సమంత టాలీవుడ్ ను వదిలించుకుంటున్నట్లే అనిపిస్తుంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో నటించడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరిగా ఆమె విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాలో మెరిసింది. తర్వాత మళ్లీ మరో సినిమాలో చేసింది లేదు. ఖుషి సినిమాకి ముందు రెండేళ్ల గ్యాప్ తీసుకుంది. అంటే.. మూడేళ్లలో ఈ అమ్మడు కేవలం రెండు సినిమాల్లో మాత్రమే కనిపించింది. ఇక నిర్మాతగా తాజాగా శుభం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. అది పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

కానీ.. తర్వాత ఆమె మరో సినిమాను ప్రకటించింది లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా బాలీవుడ్ ముద్దుగుమ్మలను ప్రిఫర్ చేస్తున్న నేపథ్యంలో.. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. సమంతతో స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఇప్పటికి రెండు మూడు సినిమాలు తెర‌కెక్కించి సక్సెస్‌లు అందుకున్నారు. కనుక పదే.. పదే.. మళ్ళీ సమంతనే తీసుకునే ఛాన్స్ లేదు. ఆడియన్స్ కు ఆ కాంబినేషన్ బోర్ కొట్టే అవకాశం ఉంది. పైగా సమంతకు డివోర్స్ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో సమంత తెలుగులో నటించిన క‌ష్ట‌మే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక‌ సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతూ వస్తాయి.. అది ఎవరైనా స‌రే. ఇప్పుడు సమంత పరిస్థితి కూడా అలానే ఉంది. స్టార్ హీరోయిన్గా దాదాపు అగ్ర హీరోల‌ అందరు సినిమాలోను నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం యావరేజ్ హీరోల సినిమాల్లో సైతం నటించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో టాలీవుడ్‌లో ఇకపై నటించకపోవడమే బెటర్ అని ఆమె ఆలోచనలో ఉందట. అవసరమైతే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తాను తప్ప.. చిన్నచిన్న ప్రాజెక్ట్ లలో అడపాదడపా రోల్స్‌లో నటించే ఆసక్తి తనకు లేదని తెలుస్తుంది. కాకపోతే.. తమిళ్ దర్శకుల సినిమాల్లో ఆమె ట్రై చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.