దట్ ఇజ్ నాగార్జున బిజినెస్ మైండ్.. కూలి తెలుగు రైట్స్ కు ఎన్ని కోట్లు పెట్టాడంటే..?

కొలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ కూలి సినిమాలో నాగార్జున డాన్ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ లో నా ఫేస్ కనపడకుండా హెయిర్ స్టైల్ లీక్ అయిన నాగార్జున లుక్స్ మ్యాచ్ కావడంతో ఆ బ్లాక్ షాడో మ్యాన్ నాగార్జున అని తేలిపోయింది. ఈ క్రమంలోనే నాగార్జున పాత్రపై ఆడియ నాగార్జునను చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై చూడనున్న క్రమంలో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత హైప్‌ నెలకొంది. ఈ క్రమంలోనే కూలి మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా తెలుగు రైట్స్ నాగార్జున కొనుగోలు చేసినట్లు టాక్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా కోసం నాగార్జున రెమ్యునరేషన్ కూడా అందరికీ షాక్‌ను కలిగిస్తుంది.

Rajinikanth's Coolie: Sensational offer for overseas rights?

ఇప్పటివరకు తమిళ్ సినిమాలు తెలుగులో హైయెస్ట్ బిజినెస్ చేసుకున్న మూవీ కంగువా. ఈ సినిమాకు రూ.25 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను కూడా.. కూలీ సినిమా బ్రేక్ చేసింది. కూలీ సినిమా తెలుగు రైట్స్‌ను నాగార్జున.. అంతకుమించి భారీ ధర పెట్టి కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఏకంగా.. రూ.60 కోట్లకు కూలి తెలుగు రైట్స్ నాగార్జున తన సొంతం చేసుకున్నాడట. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫునుంచి కూలీ తెలుగు రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన.. కూలి సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోని రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేయాల్సి ఉంది. అయితే.. అదే సమయంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసిన నటించిన వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే రెండు సినిమాలు మధ్య‌న స్ట్రాంగ్ పోటీ మొదలవనుంది.

#Coolie Nagarjuna First Look Glimpse | Super Star Rajinikanth | Lokesh  Kanagaraj | Anirudh | FT

ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విన్నర్‌గా నిలుస్తుందో వేచి చూడాలి. కాగా.. నాగార్జున ఈ సినిమాకు ఏకంగా రూ.24 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయనున్నట్లు టాక్ వినిపించింది. అయితే.. ఇప్పటివరకు ఆ రూ.24 కోట్ల రెమ్యూనరేషన్ ఆయన ఛార్జ్‌ చేయలేదు. ఈ క్రమంలోనే తెలుగు రైట్స్ కొనుగోలు చేసి ఆ రూ.24 కోట్లు కాకుండా.. మిగతా రూ.36 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక నాగార్జున బిజినెస్ మైండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి నాగర్జున.. ఈ రేంజ్‌లో భారీ ధ‌రకు తెలుగు రైట్స్‌ కొనుగోలు చేయడంతో.. సినిమా పై టాలీవుడ్ ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. కచ్చితంగా ఈ సినిమాలో ఏదో స్పెషల్ ఉండే ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ న‌టించిన సినిమా కావడంతో.. ఎలాగో సినిమా బ్లాక్ బస్టర్ అని అభిప్రాయాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇందులో నాగ్‌ పాత్ర ఎలా ఉంటుంది.. ఏ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వనున్నాడో వేచి చూడాలి.