టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ను తెచ్చిపెట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన డైరెక్టర్స్ లిస్టులో మొట్టమొదట వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాలో రీజినల్ బ్యారేజ్ దాటించి.. గ్లోబల్ లెవెల్లో దూసుకుపోయేలా రాజమౌళి తన టాలెంట్‌తో సత్తా చాటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే బాహుబలి, ఆర్ఆర్ఆర్తో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసిన జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో హాలీవుడ్ లెవెల్లో అడ్వెంచర్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. జక్కన్న రాజమౌళి కంటే ముందే తన సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై బలమైన ముద్ర వేసి చూపించాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.
డిఫరెంట్ టేకింగ్ విషయంతో ఎన్నో మాస్టర్ పీస్ సినిమాలను ఆడియన్స్ కు అందించిన ఆర్జీవి.. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఆర్జీవి.. రాజమౌళిని ఉద్దేశిస్తూ ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ డ్యామేజ్ చేసింది. రాజమౌళి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దానికి కారణం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు క్రమక్రమంగా సక్సెస్ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాల సక్సెస్ ఇండస్ట్రీకి శాపంగా మారింది అంటూ చెప్పుకొచ్చాడు. భారీ బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, రూ. 300 నుంచి 400 రోజులు లాంగ్ షూటింగ్ జరుపుకుంటేనే సినిమా సక్సెస్ అవుతుంది అన్నట్లు ఈ సినిమాలు మెసేజ్ ఇచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు.
ఇలా.. తన సినిమాలతో రాజమౌళి ఇండస్ట్రీకి బ్యాడ్ ట్రెడిషన్ అలవాటు చేయడానికి కారణమయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా.. రాజమౌళి ఇలాంటి సంస్కృతిని పరిచయం చేయకపోయి ఉంటే ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించి నిర్మాతలు చేతులు కాల్చుకునే వారు కాదంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు.. మరో డైరెక్టర్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. రాజమౌళి తెచ్చిన ఈ విష సంస్కృతికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చెక్ పెట్టాడని.. ఆయన రణబీర్ కపూర్‌తో తెరకెక్కించిన యానిమల్ మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో భారీ హంగులు లేకుండా అతితక్కువ రోజుల్లో షూట్ పూర్తిచేసి బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టడంటూ ప్రశంసించాడు. ఈ క్రమంలోనే ఆర్జీవి.. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా గురించి చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.