సమస్యల్లో శ్రీ లీల.. అమ్మడి కష్టాలకు కారణం పవనేనా..?

శ్రీకాంత్ అన్న కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల.. రవితేజ ధమాకా సినిమాతో భారీ స్టార్‌డంను దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడు వెనతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలను అందుకుని..రష్మిక, పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్‌ను సైతం పక్కకు నెట్టి తెగ వైరల్ గా మారింది. అయితే తను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవుతున్న.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల్లోని చాన్సులు కొట్టేసింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో సక్సెస్ అందుకుంటే కెరియర్ మారిపోతుందని శ్రీ లీల కలలు కంది. అయితే మహేష్ బాబుతో.. శ్రీ లీల నటించిన గుంటూరు కారం సినిమా యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకుంది.

Aashiqui 3: Sreeleela's Bollywood debut announced | Telugu Cinema

ఇక పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి రాలేదు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో.. సాధారణ ఆడియన్స్‌లో సైతం.. ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. పవన్ పొలిటికల్ జర్నీ కారణంగా సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు సినిమా జూన్ నుంచి కొత్త స్కెడ్యూల్‌ను ప్రారంభించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కోసం శ్రీల బల్క్ డేట్స్ కేటాయించాల్సి ఉంది. ఈ క్రమంలోనే అమ్మడు జూన్ నుంచి సెట్స్‌లో పాల్గొనే అవకాశం ఉందట. మరోపక్క.. తాజాగా నార్త్ ఎంట్రీకి రెడీ అయ్యిన ఈ అమ్మ‌డు..సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీంతో ఓ సినిమాకు సిగ్నల్ ఇచ్చింది.

Sreeleela's first look from Ustad Bhagat Singh out. See poster - India Today

వీటితో పాటే కార్తీక్ ఆర్య‌న్‌తో ఆషికి 3 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 40% షూట్‌ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఊహించని విధంగా ఉస్తాద్‌ భగత్ సింగ్ వర్క్‌కు.. డేట్ లు ఇవ్వాల్సి వస్తున్న నేపథ్యంలో.. ఓ వైపు హిందీ సినిమా షూటింగ్ వాయిదా పడనుంది. ఈ క్రమంలోనే శ్రీ‌లీల‌కు కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఆషికి 3 ని వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని టీం భావిస్తున్నారు. ఇక కోలీవుడ్‌లో కూడా పరాశక్తి అనే సినిమాతో అమ్మడు ఎంట్రీ ఇవ్వనంది. ఈ సినిమాను సైతం వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలి. ఇలా.. సడన్గా పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ ప్రారంభం అవ్వడంతో మిగతా సినిమా షూటింగ్లకు అమ్మడు డేట్స్ కేటాయించడానికి సతమతం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.