నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ పేరు చెప్తే చాలు.. తెలుగునాట పులకరించిపోతుంది. ఒకప్పుడు ఆయన నటించని సినిమాలు, పాత్రలు లేవు. ఎంత కష్టతరమైన పాత్రలైనా సరే.. ఇట్టే ఒదిగిపోయి నటించే ఎన్టీఆర్.. కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టాడు. కేవలం నటన పరంగానే కాదు.. రాజకీయ పరంగాను ఎన్టీఆర్ జనాలకు అందించిన సేవ.. చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటికి ఎన్టీఆర్ సినిమాలు టీవీలో వస్తున్నాయంటే.. జనం ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఆయనకు ప్రజల మనసులో మాత్రం ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. కాగా.. నిన్న ఆయన జయంతి సందర్భంగా నందమూరి కుటుంబంతో పాటు తెలుగు ప్రజలు ఈ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఊరువాడలని అన్నగారి పేరుతో మారుమోగిపోయాయి. కాగా.. ఇలాంటి క్రమంలో.. తాత ఎన్టీఆర్ పేరును నిలబెడుతూ తారక్ కూడా ఆయననే ఫాలో అవుతున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా పలు సినిమాలో నటిస్తూ సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న వీరిలో ఎన్టీఆర్.. తాత పేరు నిలబెట్టేలా గ్లోబల్ రేంజ్‌కు ఎదిగాడు. ఇక.. కళ్యాణ్ రామ్ సినిమాలు నిర్మిస్తూ బిజీగా రానిస్తున్నాడు. కాగా.. గతంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా.. తమ్ముడు త్రివిక్రమరావు పలు ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలో కొన్నింటికి సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం విశేషం.
తర్వాత రోజుల్లో బాలకృష్ణ హీరోగా.. అన్న హరికృష్ణ సినిమాలను రూపొందించాడు. వాటిలో పలు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా.. ఇప్పుడు తారక్ హీరోగా నటిస్తుండగా.. ఆయన అన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక సినిమాలను తెరకెక్కించారు. దర్శకునిగా ఎన్టీఆర్ ఎన్నో రేర్ ఫీట్లను సాధించాడు. కాగా.. తండ్రిని అనుసరిస్తూ బాలయ్య కూడా 2004లో నర్తనశాల సినిమాను స్వీయ డైరెక్షన్లో రూపొందించాలని ప్రయత్నించాడు.. కానీ.. కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. కాగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ తాత నట వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక నటన టాలెంట్‌లో తాతని ఫాలో అవుతూ మంచి పేరును సంపాదించుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ప్రజెంట్ ఎన్టీఆర్ సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.