టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో కన్నప్ప ఒకటి. మంచు విష్ణు హీరోగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన ఓ హార్డ్ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల అందించిన వివరాలు ప్రకారం ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతలలో (హైవే స్టూడియోస్)కు సంబంధించిన ఒకరు కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలక హార్డ్ డ్రైవర్ డిటిడిసి కొరియర్ ద్వారా ఫిలింనగర్.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. డిటిడిసి డెలివరీ రికార్డుల ప్రకారం ఫార్మిల్ ఈనెల 25న కార్యాలయానికి చేరుకుందట. అయితే ఫార్మిల్ అందుకున్న ఆఫీస్‌బాయ్ రఘు దీనిని చరిత అనే ఓ యువతకి అప్పగించినట్లు వెల్లడించాడు. కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్ డ్రైవ్ విషయమై రఘుని ప్రశ్నించడంతో.. నేను దానిని చరితకు అప్పగించానని ఆ హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటినుంచి తప్పించుకొని తిరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
కొందరు వ్యక్తులు మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న చరిత.. ఈ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే ఇలా హార్ట్ డ్రైవ్‌తో కనిపించకుండా వెళ్లిపోయిందని.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన రెడ్డి విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలా హార్డ్ డ్రైవ్‌తో యువతి పారిపోయిన క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు తీవ్ర అంతరాయం కలిగిందని.. సదరు హార్డ్ డ్రైవ్‌లో కన్నప్ప సినిమాకు సంబంధించిన.. రివీల్ కానీ, గోప్యమైన, అత్యంత సున్నితమైన డేటా చాలా ఉందని పేర్కొన్నారు. ఈ కంటెంట్‌ను లీక్ చేయడం.. లేదా డిలీట్ చేయడంతో.. తమ సంస్థ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ పడుతుందని.. ఫిర్యాదులో వెల్లడించారు. తక్షణమే హార్ట్ డ్రైవ్‌ను రికవరీ చేసి తమకు అప్పగించాలని పోలీసులను కోరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.