చిరంజీవి ఓ దుర్మార్గుడు, రాక్ష‌సుడు.. మెగాస్టార్ పై హీరో కమ్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌లో చిరంజీవి దాదాపు 5 దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో 156 సినిమాలను పూర్తి చేశాడు. ఐదు దశాబ్దాల జర్నీలో.. లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, ఇబ్బందుల తర్వాత.. కెరీర్‌లో సక్సెస్ అందుకున్నాడు. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే.. ఇటీవల సినిమాల్లోకి ఆయన రీయంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. చిరంజీవి గురించి తెలిసినవారు.. ఆయనతో పని చేసిన వారంతా చిరు క్రమశిక్షణకు మారుపేరని చెబుతూ ఉంటారు. ఏదైనా సినిమా షూట్ ఉందంటే అరగంటకు ముందే సెట్స్ లో వాలిపోతారని.. ఆయనతో పనిచేసే వాళ్లు చెబుతూ ఉంటారు.

ఇక గతంలో ఎలాంటి యాక్షన్ సీన్స్ అయినా తానే స్వయంగా చేసేవాడట చిరు. షూటింగ్కు అసలు టైం వేస్ట్ కాకూడదని.. తన వల్ల అస్సలు లేట్ కావద్దని భావించేవాడట. ఈ నేపథ్యంలో ఇతరులు ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. ఘరానా మొగుడు షూట్ టైంలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందంటూ మెగాస్టార్ అభిమాని.. స్టార్ హీరో.. .ఏడీ చక్రవర్తి వెల్లడించారు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. చిరంజీవి గారు నేను చెబుతున్నాని కాదు..ప‌ర‌మ దుర్మార్గుడు.. 1992లో రామ్ గోపాల్ వర్మ దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేశా.. ఈ క్రమంలోనే నాగార్జునతో అంతం సినిమా రూపొందిస్తున్నారు. అదే టైంలో చిరంజీవి ఘరానా మొగుడు సినిమా షూట్ జరుగుతుంది.

రెండు సినిమాలు పక్కపక్కన షూట్ జరుగుతున్న నేపథ్యంలో.. ఘరానా మొగుడు క్లైమాక్స్ షూట్.. చిరంజీవి యాక్షన్ సీన్స్ లో షూట్ చేస్తున్నారు అంటూ వివ‌రించాడు. వరుసగా ఎనిమిది రోజులు షూటింగ్ ఉంటే.. ఎనిమిది రోజులు చిరంజీవి కార్ లోనే బస చేశారు. ఫైటర్లు, యూనిట్లు మారుతున్నా.. చిరంజీవి మాత్రం కారులోనే పడుకునేవాడు.. అప్పట్లో కెరవాన్‌లు లేవు. షార్ట్ గ్యాప్ లో వెళ్లి కారులో లేదా బయట పడుకునేవాడు అంటూ వివరించాడు. అయితే.. నేను ఆయన అభిమానిని..పైగా పెద్ద స్టార్ హీరో.. కావడంతో ఆయన కలవడానికి అక్కడికి వెళ్ళా.

Gharana Mogudu - Alchetron, The Free Social Encyclopedia

మీరు ఎంత పెద్ద సూపర్ స్టార్.. ఇలా కారులో పడుకోవడమేంటి మేకప్ రూమ్ లో పడుకోవచ్చు కదా సార్ అని అడిగా.. ఇలా కారులో పడుకోవడం ఏమీ బాగోలేదు.. నాకు అసలు నచ్చడం లేదంటూ వివరించా. దానికి.. చిరంజీవి రియాక్ష‌న్‌కు షాక్ అయ్యా. చిరంజీవి గారు మాట్లాడుతూ.. ఏం లేదండి.. ఇప్పుడు నేను లోపల పడుకుంటే మోహన్ (అసిస్టెంట్) లేపడు. బయట పడుకుంటే డైరెక్టర్ మైక్ లో రెడీ.. రెడీ.. చిరంజీవి గారిని పిలవండి అనగానే వెంటనే లేచి వెళ్ళిపోవచ్చు. ఆ గ్యాప్ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు అంటూ వివరించారని.. జె.డి చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ఆయన ఓ పని రాక్షసుడు అంటూ జెర్రీ చక్రవర్తి కామెంట్స్ చేశాడు. ఇక 1992 ఏప్రిల్ 9న రిలీజ్ అనే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిందో తెలిసిందే. అప్పట్లోనే డిస్ట్రిబ్యూటర్లకు రూ.10 కోట్ల షేర్ తెచ్చి పెట్టిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.