టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే 30 శాతం షూట్ పూర్తి చేసిన టీం.. సినిమాను శరవేగంగా పూర్తిచేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం ముగించుకొని రిలీజ్ చేయాలని ఆరాటపడుతున్నారు. కాగా.. ఇప్పటికే పెద్ది నుంచి వచ్చిన ప్రమోషనల్ వీడియో ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. కాగా చరన్.. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ.. కథ మొత్తం పూర్తయి సెట్స్ పైకి రావడానికి మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే.. చరణ్ ఈ గ్యాప్‌లో మరో సినిమాను మొదలుపెట్టి ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట. దీంతో.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై.. ఓ సినిమా చేయాలని ఆయన ఫిక్స్ అయినట్లు టాక్. దానికి తగ్గట్లుగానే అనిల్ అనే ఒక కొత్త డైరెక్టర్ చరణ్‌కు చెప్పిన స్టోరీ బాగా నచ్చేసిందట. అయితే అది భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. సినిమా సెట్స్‌పైకి రావడానికి దీనికి కూడా మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పెద్ది షూట్ పూర్తి అయిన వెంటనే.. ఓజి డైరెక్టర్ సుజిత్ తో రామ్ చరణ్ సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నాడట. చరణ్ ఇమేజ్, ఫ్యాన్ బేస్‌కు తగ్గట్టుగా సుజిత్ దగ్గర యాక్షన్ స్క్రిప్ట్ ఉందని తెలుస్తోంది.
అయితే.. ఓజి రిజల్ట్ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుని అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీ బిజీగా గడుపుతున్న చరణ్.. త్వరగా ఈ సినిమా షూటింగ్స్ పూర్తి చేసేయాలని.. ఫిక్స్ అయ్యారట. సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతిబాబు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ప్, సహా వృద్ధి సినిమా బ్యానర్ పై సంయుక్తంగా రూపోందిస్తున్నఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం ఓజి సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నారు. దాదాపు మూడు వారాలు పాటు పవన్‌తోపాటు.. ఇతర యాక్టర్స్ అంతా.. ఈ కీలక సీన్స్ షూట్ చేసేందుకు వీలుగా మేకర్స్ ప్లాన్స్ సిద్ధం చేశారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుజిత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ రిజల్ట్ పైన చరణ్ ప్రాజెక్ట్ కూడా ఆధారపడి ఉందట.