సౌత్ ఇండియాలో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అ ముద్దుగుమ్మలలో నయనతర పేరు మొదట వినిపిస్తుంది. ఈమె తెలుగు ఆడియన్స్‌కి మొట్టమొదటిసారి చంద్రముఖి సినిమాతో పరిచయమై.. తన అందం, నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తర్వాత ఆమె ప్రయాణం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయింది. టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలు సరసన నటించిన నయనతార.. ఎక్కువగా తమిళ్ సినిమాలకే పరిమితం అయింది. ఇక రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో హీరోయిన్గా నటించినందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఆమె రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
కానీ.. అందులో వాస్తవం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేవలం ఆమె రూ.6 కోట్ల రెమ్యునరేషన్‌ను మాత్రమే ఈ సినిమా కోసం తీసుకోనిందట నయనతార. తన ప్రతి సినిమాకు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుంటే కేవలం చిరు కోసం మాత్రమే మొదటిసారి ఇంత తక్కువ రెమ్యనరేషన్‌ను ఒప్పుకున్నట్లు టాక్ నడుస్తుంది. అంతేకాదు.. ఆమె సినిమా కోసం అగ్రిమెంట్ చేసే ముందు కొన్ని షరతులను కూడా బ్రేక్ చేసిందట. వాటిలో మొదటిది ప్రమోషన్స్. నయన్ స్టార్‌గా మారిన తర్వాత తన సినిమా ప్రమోషన్స్‌కు కానీ.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు, మరేదైనా ఈవెంట్స్‌కు రానని ముందే కండిషన్స్ పెట్టేస్తుంది. కారణం తెలియదు కానీ.. ఆమెకు ఆమె చేసుకున్న ఈ ప్రామిస్ మెగాస్టార్ కోసం బ్రేక్ చేసింది అంటూ టాక్ నడుస్తుంది. మెగాస్టార్‌తో నయన్ ఇప్పటికే సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈ రెండు సినిమాల రిలీజ్ టైం లో ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. కానీ.. అనిల్ రావిపూడి.. చిరు సినిమా కోసం మాత్రం నయన్ ఈ కండిషన్లో బ్రేక్ చేసేందుకు సిద్ధమైందట. తన కెరీర్‌లో మొదటిసారి తను పెట్టుకున్న కండిషన్ను ఒక హీరో కోసం నయన్ బ్రేక్ చేసింది అంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా కోసం ఆ కండిషన్స్ బ్రేక్ చేయడానికి ప్రధాన కారణం అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్. ఆయన సినిమాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ వైవిధ్యంగా, క్రేజీగా ఉంటాయి. కేవలం ప్రమోషన్స్ తోనే ఆయన సినిమాపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ హైప్‌ని తీసుకువస్తాడు. అందుకే అనిల్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో నయన్ అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే నయన్ సినిమా కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టనుందని.. త్వరలోనే టీం అఫీషియల్ గా దీన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత చిరు రేంజ్ కు తగ్గ కామెడీ ఎంటర్టైనర్‌ను అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. కేవలం మూడు నెలల్లోనే సినిమా షూట్ పూర్తి చేసి.. వచ్చే ఎడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేస్తున్నారు.