టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అదే రేంజ్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనిల్.. తెరకెక్కించిన ప్రతి సినిమాలోను కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ మధ్యన బాండ్.. లేదా భర్త, బాయ్ ఫ్రెండ్స్ తో ఒక రకమైన రిలేషన్ కలిగి ఉండేలా కథలను రూపొందిస్తూ ఉంటాడు. అయితే అలాంటి అనిల్ రావిపూడి లవ్ స్టోరీ, పెళ్లి విశేషాలు ఏంటో తెలుసుకోవాలి ఆశక్తి చాలా మందిలో ఉంటుంది. ఇక అనిల్ రావిపూడి టెన్త్, ఇంటర్ సమయంలో అమ్మాయిలకు చాలా దూరంగా ఉండేవాడట.
కానీ.. వాళ్ళ అటెన్షన్ తనపై ఉండాలని కోరుకునేవాడు. అలా ఆయన గుంటూరులోని విజ్ఞాన్ కాలేజ్ లో బీటెక్ జాయిన్ అయినా తర్వాత ఎవరైనా అమ్మాయిలు మాట్లాడతారు ఏమో అని భావించేవాడట. కానీ.. ఎవరు మాట్లాడేవారు కాదని.. అయితే అనిల్ రావిపూడి అమ్మాయిలతో మాట్లాడేందుకు తన భార్యతో ప్రేమలో పడడానికి.. నటుడు రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా సహాయం చేశారని తెలుస్తుంది. అదెలా అనుకుంటున్నారా.. చిన్నప్పుడు అనిల్ పెరిగిన ఊర్లో ఛలో తిరుపతి అనే కామెడీ స్కిట్ ని రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డి వెళ్లి ప్రదర్శిస్తూ ఉండేవారట.
ఇదే స్కిట్ అనిల్ విజ్ఞాన్ కాలేజ్‌లో జరిగిన ప్రోగ్రాంలో రీమేక్ చేసి చూపించారట. ఆహ నా పెళ్ళంట సినిమా ఫ్లేవర్‌ని అందులో యాడ్ చేశాడట. ఆ స్కిట్ సూపర్ డూపర్ హిట్ అవడంతో.. చాలామంది అమ్మాయిలు అనిల్ కు కంగ్రాట్యులేషన్ చెప్పడానికి క్యూ కట్టారు. అందులో భార్గవి కూడా ఒకటి. ఆమె అనిల్ కు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్షిప్ కుదుర్చుకుంది. భార్గవితో పాటు.. మరో ఇద్దరు అనిల్‌తో కలిసి చాలా క్లోజ్‌గా ఉండేవారట. ఆ తర్వాత అనిల్, భార్గవి ఇద్దరి మధ్యన ప్రేమ చిగురించడంతో.. 12 ఏళ్ల పరిచయం తర్వాత వీళ్ళు వివాహం చేసుకున్నారు. ఇలా అనిల్ రావిపూడి ప్రేమకు రఘు బాబు, శ్రీనివాస్ రెడ్డిలు ఇన్ డైరెక్ట్ గా హెల్ప్ చేశారు.