నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం హ్యట్రిక్తో ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. బాబి డైరెక్షన్లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందింది. ఇక ఈ సినిమాల్లో బాలయ్యకు పొట్టిగా బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్.
టైటిల్ రిలీజ్ చేసిన మూవీ టీం.. తాజాగా మూవీ టైటిల్ సాంగ్కూడా రిలీజ్ చేశారు. దీనితో పాటే సినిమా స్టోరీ పై కూడా క్లారిటీ ఇచ్చారు. 1980లో చంబల్ ఏరియాలో దోపిడీ ముఠాకి సంబంధించిన ఓ వ్యక్తి కథ ఇది అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటివరకు సినిమా నుంచి గ్లింప్స్, టైటిల్ సాంగ్ రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఓవర్సీస్లో తాజాగా అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే.. ఖాతాలో ఓ వేస్ట్ రికార్డ్ చేరింది. అదేంటంటే వారం రోజుల క్రితం ది రేస్ ఆఫ్ డాకు లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా.. ఈ వీడియో సాంగ్ ఇప్పటివరకు కేవలం 2.6 మిలియన్ వ్యూస్ మాత్రమే రాబటడం నిజంగా అందరికీ షాక్ కలిగిస్తుంది.
ఓ టాప్ స్టార్ హీరో అది కూడా బాలయ్య సాంగ్స్ ఈ రేంజ్ లో వ్యూస్ అంటే ఆయన కెరీర్లోనే సుత్తి, చెత్త రికార్డ్ అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రిలీజ్ అవుతున్న ప్రతి సాంగ్, ట్రైలర్ కు యూట్యూబ్ లో యాడ్స్ వేస్తూ.. వ్యూస్ సంపాదిస్తున్నారు. కానీ.. డాకు మహారాజు మాత్రం అలాంటివి ఏమీ చేయలేదు.. అందుకే ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. నెలరోజుల క్రితం రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ వీడియో ఏకంగా 13+ మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా గ్లింప్స్ వీడియోకు ఫిదా అయ్యారు. అలాంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ వచ్చిన తర్వాత.. సాంగ్కు ఇలాంటి రెస్పాన్స్ రావడం బాలయ్య ఫ్యాన్స్ కు నిరాశ కల్పిస్తుంది.